అన్వేషించండి

Rajat Patidar In Team India Race:  లైమ్‌లైట్ లోకి ఆర్‌సీబీ కెప్టెన్ పాటిదార్: టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్

సూర్యవంశీ టీమిండియా ఎంట్రీ చర్చల నడుమ ఆర్‌సీబీ కెప్టెన్ పాటిదార్ క్వాలిఫయర్ 1లో గుజరాత్ పై 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో సంచలనం సృష్టించాడు. అలాగే రెండోసారి ఆర్సీబీని రెండోసారి ఫైన‌ల్ కు చేర్చాడు.

Rajat Patidar Captaincy Knock Puts RCB Into Final: భార‌త‌ క్రికెట్ సర్కిల్స్ లో అందరూ వైభవ్ సూర్యవంశీ సీనియర్ టీమ్ డెబ్యూ, శ్రేయస్ అయ్యర్ టీ20 పునరాగమనం గురించి మాట్లాడుకుంటున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ సైలెంట్ గా హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు చేసిన పాటిదార్ తనలోని అసలైన పొటెన్షియల్ ను ప్రపంచానికి మరోసారి చూపించాడు. ఒక ప్రశాంతమైన లీడర్ గా, సాలిడ్ బ్యాటర్ గా జట్టును నడిపిస్తూ ఆర్‌సీబీని వరుసగా రెండోసారి ఫైనల్ కు చేర్చిన పాటిదార్ ను ఇకపై ఎవరూ ఇగ్నోర్ చేయలేరు.

Read Also: IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ,

కెప్టెన్ గా రజత్ పాటిదార్ సక్సెస్.. 

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు రజత్ పాటిదార్ ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్సీ చేపట్టిన మొదటి ఏడాదిలోనే ఫ్రాంచైజీ హిస్టరీలోనే తొలిసారి ఐపీఎల్ టైటిల్ అందించి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఆ విజయం కేవలం అదృష్టం వల్ల రాలేదని నిరూపిస్తూ ఈ 32 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటర్ ఈ ఏడాది కూడా ఆర్‌సీబీని సగర్వంగా ఫైనల్ కు లీడ్ చేశాడు. గ్రౌండ్ లో చాలా కూల్ గా ఉండే పాటిదార్ లీడర్‌షిప్ స్కిల్స్ ఆర్‌సీబీకి ఇన్‌స్టంట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. గత మూడు సీజన్ల నుంచి 300 పైగా పరుగులు చేసిన అతడు, ఈసారి 14 మ్యాచ్ ల్లోనే 44.18 యావరేజ్ తో ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 486 పరుగులు సాధించి బెస్ట్ కన్సిస్టెన్సీ చూపించాడు.

Read Also: Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీ సంచలనం: క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్.. ఎలిమినేటర్ లో సిక్సర్ల తుఫాన్

సెలెక్టర్ల దృష్టిలో పాటిదార్.. 

క్వాలిఫైయర్ 1 లో పాటిదార్ ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాత టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో ప్రశంసల వర్షం కురిపించాడు. నేషనల్ సెలెక్టర్ల మీటింగ్ లో పాటిదార్ పేరు కచ్చితంగా చర్చకు వస్తుందని, అలా జరగకపోతే సిస్టమ్ లోనే లోపం ఉన్నట్లు అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ప్లేఆఫ్స్ మ్యాచ్ ల్లో పాటిదార్ కు అద్భుతమైన రికార్డ్ ఉందని గుర్తు చేశాడు. ఈ ఇన్నింగ్స్ కంటే ముందు సెలెక్టర్ల రేసులో శ్రేయస్ అయ్యర్ కొంచెం ముందంజలో ఉన్నా, ప్రస్తుత పర్ఫార్మెన్స్ తో పాటిదార్ రేసులోకి దూసుకొచ్చాడని చెప్పాడు. పాటిదార్ స్పిన్నర్లను బాగా ఆడతాడని అందరికీ తెలుసని, గుజరాత్ పేసర్లను కూడా అతడు సమర్థవంతంగా ఎదుర్కోవడం తనను ఆశ్చర్యపరిచిందని అశ్విన్ విశ్లేషించాడు.

టీమిండియాలో హెవీ కాంపిటీషన్.. 

పాటిదార్ ఇప్పటికే ఇండియా తరఫున మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడినా వచ్చిన అవకాశాలను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తో టీ20 జట్టు సెలెక్షన్ కోసం గట్టిగా పోటీ పడుతున్నా టీమిండియా మిడిల్ ఆర్డర్ లో ఉన్న విపరీతమైన కాంపిటీషన్ అతడికి పెద్ద సవాల్ గా మారింది. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా అతడు వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ క‌మ్ స్టార్ ప్లేయర్ కావడం, సూర్యకుమార్ కు ప్రత్యామ్నాయంగా శ్రేయస్ అయ్యర్ లాంటి కన్సిస్టెంట్ ప్లేయర్స్ రేసులో ముందుండటం పాటిదార్ ఆశలపై ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. అయినా సరే పాటిదార్ తన పరుగుల వేటను ఆపకుండా సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget