MI vs PBKS Qualifier 2: పంజాబ్, ముంబై మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. మ్యాచ్ రద్దయితే ఎవరికి నష్టం, ఫైనల్ చేరేది ఎవరంటే..
MI vs PBKS, Qualifier 2 at Ahmedabad | పంజాబ్, ముంబై మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ముంబై ఇండియన్స్ ఇంటికి, పంజాబ్ ఫైనల్ చేరుతుంది.

PBKS vs MI Match | అహ్మదాబాద్: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు టాస్ వేసిన సమయంలో అంతా బాగానే ఉంది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో వర్షం మొదలైంది. చినుకులు పడటంతో పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
కానీ వర్షం కారణంగా నేడు మ్యాచ్ రద్దు అయితే, ఈ క్వాలిఫయర్-2కి రిజర్వ్ డే లేదు. మొదట ఈ మ్యాచ్ కోసం అదనంగా 120 నిమిషాలు అంటే 2 గంటలు కేటాయిస్తారు. ప్రస్తుతం వర్షం తగ్గింది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే లీగ్ స్టేజీలో బెస్ట్ పాజిషన్లో నిలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
వర్షం వల్ల ముంబైకి నష్టం
కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఈ మ్యాచ్ జరిగి విజేగా నిలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. జూన్ 3న జరిగే టైటిల్ పోరులో ఆర్సీబీతో తలపడనుంది. అయితే నేటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మాత్రం పంజాబ్ జట్టుకు అదృష్టం కలిసొస్తుంది. లీగ్ దశలో మెరుగైన పాయింట్లు సాధించిన జట్టు పంజాబ్ ఫైనల్ చేరి, ఆర్సీబీని ఢీకొట్టనుంది. లీగ్ స్టేజీలో టాప్ 2లో పంజాబ్ నిలవగా, ముంబై నాలుగో స్థానంలో నిలిచింది. దాంతో భారీ వర్షం వల్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాక, మ్యాచ్ రద్దు అయితే కనుక లీగ్ స్టేజీలో మెరుగైన పాయింట్లు సాధించిన పంజాబ్ నేరుగా ఫైనల్ చేరుతుంది.
🚨 Update 🚨
— IndianPremierLeague (@IPL) June 1, 2025
Start of play delayed due to rain.
Stay tuned for further updates ▶ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile pic.twitter.com/U36OmiVeZ2
వర్షం తగ్గి మ్యాచ్ జరగాలని ముంబై ఇండియన్స్ కోరుకుంటోంది. ముంబై ఫ్యాన్స్ సైతం అదే ఆశిస్తున్నారు. లేకపోతే వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ముంబై నిరాశగా ఇంటిబాట పట్టాల్సి వస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏ విఘ్నాలు కలగకూడదని గణపతి బప్పా మోరియా అంటూ ముంబై పోస్ట్ చేసింది. కానీ అంతలోనే చినుకులు మొదలవడంతో పిచ్, థర్టీ యార్డ్ సర్కిల్ వరకు కవర్లతో కప్పేశారు. లీగ్ ఫస్టాఫ్ లో దారుణంగా ఆడిన ముంబై.. సెకండాఫ్ లో బెబ్బులిలా ఆడింది. వరుస విజయాలతో టాప్ 4 చేరి ప్లేఆఫ్ కు వచ్చింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో పటిష్ట గుజరాత్ టైటాన్స్ ను ఓడించి క్వాలిఫయర్ కు రెడీ అయింది. వర్షం రూపంలో ముంబై విజయం దోబూచులాడుతోంది.





















