Shubman Gill : మూడేళ్లుగా నేను సింగిల్, ఆ వ్యక్తి కోసం ఆలుపరాటా తిన్నా: డేటింగ్ రూమర్స్‌పై శుభ్‌మన్ గిల్
Shubman Gill :హృతిక్ రోషన్‌కు శుభ్‌మన్ గిల్ పెద్ద అభిమాని అంట. ఆయన కోసం తనకు ఇష్టం లేని ఫుడ్‌ను తినడం ప్రారంభించాడట. అంతే కాదు డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు.

Shubman Gill :ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తరచుగా లైమ్‌లైట్‌లో ఉంటారు. ఇటీవలే ఈ క్రికెటర్ తనకు ఇష్టమైన బాలీవుడ్ నటుడి పేరు చెప్పాడు. తన వల్ల తాను చాలా ద్వేషించే ఆహారాన్నికూడా తినడం మొదలుపెట్టానని శుభ్‌మన్ వెల్లడించాడు.
శుభ్‌మన్ గిల్ ఇటీవలే తాను బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు గొప్ప అభిమాని అని వెల్లడించాడు. ఆయన వల్ల తాను ఆలూ పరాటాలు తినడం మొదలుపెట్టానని, అప్పటి వరకు ఇష్టం లేక వాటిని ఎప్పుడూ తినలేదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో సారా అలీ ఖాన్, సారా టెండూల్కర్ తో డేటింగ్ రూమర్స్ కు ఫుల్‌స్టాప్ పెట్టాడు.
హృతిక్ రోషన్ వల్ల ఆలూ పరాటాలు తినడం మొదలుపెట్టా
ఓ మీడియాకు ఇచ్చిన ఇటీవలి ఇంటర్వ్యూలో శుభ్మన్ గిల్ చాలా అంశాలు చెప్పుకొచ్చాడు- 'చిన్నప్పుడు నేను హృతిక్ రోషన్‌కు గొప్ప అభిమానిని. చిన్నప్పుడు నాకు పరాటాలు అస్సలు ఇష్టం లేదు, కానీ నేను వాటిని తినడం మొదలుపెట్టాను ఎందుకంటే 'కహో నా ప్యార్ హై'లో హృతిక్ పాత్రకు ఆలూ పరాటాలు చాలా ఇష్టం.'
డేటింగ్ రూమర్స్ గురించి క్లారిటీ
డేటింగ్ రూమర్స్ గురించి మాట్లాడుతూ శుభ్‌మన్ ఇలా అన్నాడు- 'నేను మూడు సంవత్సరాలకుపైగా సింగిల్‌గా ఉన్నాను . చాలా ఊహాగానాలు,, గాసిప్‌లు నన్ను వివిధ వ్యక్తులతో లింకు పెట్టేశాయి. కొన్నిసార్లు ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను నా జీవితంలో ఆ వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు, కలుసుకోలేదు. అలాంటప్పుడు ఆ వ్యక్తితో ఉన్నానని గాసిప్‌లు వినిపిస్తూ ఉంటాయి .'
ముందుగానే హృతిక్ అభిమాని అని చెప్పాడు శుభ్‌మన్
శుభ్‌మన్ గిల్ హృతిక్ రోషన్ గురించి ఇలా మాట్లాడినది ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో 'స్పైడర్-మ్యాన్: అక్రాస్ ది స్పైడర్-వర్స్' యానిమేటెడ్ చిత్రం ట్రైలర్ లాంచ్ సమయంలో కూడా శుభ్‌మన్ తాను హృతిక్ రోషన్‌ను చాలా ఇష్టపడతానని చెప్పాడు. క్రికెటర్ ఇలా చెప్పాడు- 'హృతిక్ రోషన్ నాకు చాలా ఇష్టం. ఐశ్వర్య , హృతిక్ కలిసి నటించిన 'ధూమ్' వచ్చినప్పుడు, చాలా ఇష్ట పడ్డాను. నేను హృతిక్ లాగా బాగా డ్యాన్స్ చేయలేను, కానీ 'కోయి మిల్ గయా' చూసిన తర్వాత, నేను అతని మరింతగా అభిమాని అయ్యాను.'




















