అన్వేషించండి

IPL 2024: ఆర్సీబీ సిక్సర్ల కింగ్‌, కోహ్లీనే గేల్‌ రికార్డు బద్దలు

Virat Kohli: టీమ్​ ఇండియా స్టార్‌, కింగ్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున అత్యధిక సిక్సులు కొట్టిన  బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

 Virat Kohli breaks Chris Gayle, MS Dhoni's records in RCB vs KKR match:  రికార్డుల రారాజుగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌(IPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) తరపున అత్యధిక సిక్సులు కొట్టిన  బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. యూనివర్సల్‌ బాస్‌, విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌లో 239 సిక్సులు బాది ఆర్సీబీ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటివరకూ కొనసాగాడు. . కోహ్లీ  మరో 2 సిక్స్ లు ఎక్కువ బాడీ 241 సిక్సర్లతో  ఆ‌ర్సీబీ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా అగ్రస్థానం దక్కించుకున్నాడు. 

ఐపీఎల్‌లో RCB తరఫున అత్యధిక సిక్సర్లు 
241 - విరాట్ కోహ్లీ 
239 - క్రిస్ గేల్ 
238 – ఏబీ డివిలియర్స్ 
67 - గ్లెన్ మాక్స్‌వెల్‌
50 – ఫాఫ్ డు ప్లెసిస్

క్యాచుల్లోనూ కాసుకకూర్చుంటాడు.. 

విరాట్‌ కోహ్లీ అంటే స్టార్‌ బ్యాటర్‌. ఎలాంటి బౌలర్‌పై అయినా తనదైన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో ఆధిపత్యం చెలాయించగల క్రికెటర్‌. ఎన్నో రికార్డులను నెలకొల్పి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. కానీ విరాట్‌ కోహ్లీ అంటే కేవలం బ్యాటింగ్‌లో అత్యుత్తమ రికార్డులే కాదు. ఫీల్డింగ్‌లోనూ  ఓ అరుదైన రికార్డు విరాట్‌ పేరిట ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్‌.. సురేష్‌ రైనాతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లో 109 క్యాచ్‌లను అందుకున్నారు. విరాట్‌ మరో క్యాచ్‌ పడితే సురేష్‌ రైనాను అధిగమిస్తాడు. కోహ్లీ మరో క్యాచ్ అందుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా తర్వాత కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. పొలార్డ్ 103 క్యాచ్‌లు పట్టాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 99 క్యాచ్‌లు అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రవీంద్ర జడేజా 97 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పేర్లు టాప్-5లో ఉన్నాయి. సురేష్ రైనా, కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో ఆడుతున్నారు. 

ఇంత చేసినా తప్పని పరాజయం -బెంగళూరుకు రెండో లాస్ 
కోల్‌కతా(KKR) చేతిలో బెంగళూరు(RCB) చిత్తుగా ఓడింది. సొంత మైదానంలో 7 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో సొంత వేదిక జట్లే నెగ్గాయి. కానీ ఐపీఎల్ సీజన్ 17లో తొలిసారిగా ప్రత్యర్థి జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. విరాట్‌ కోహ్లీ 83 పరుగులతో  రాణించడంతో 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే ఛేదించింది. కోల్‌కతాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PPP Medical Colleges: దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
No Cut In MRP: జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
TGSRTC Tour Packages: హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త
Sai Durgha Tej: ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
Advertisement

వీడియోలు

Boycott Asia cup 2025 Ind vs Pak Match | సోషల్ మీడియాలో మళ్లీ బాయ్‌కాట్ ట్రెండ్ | ABP Desam
Asia Cup 2025 | ఒమన్ పై పాకిస్తాన్ బంపర్ విక్టరీ | ABP Desam
Quentin Tarantino - Master of Stylized Violence | హాలీవుడ్ ను రక్తంతో తడిపేసిన డైరెక్టర్ | ABP Desam
Sachin Tendulkar BCCI Next President | బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్‌గా సచిన్ ఎన్నికయ్యే అవకాశం | ABP Desam
Ind vs Pak | పాక్ జట్టులో అనుకోని సమస్య.. భారత్‌తో మ్యాచ్‌కు డౌటే | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PPP Medical Colleges: దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
No Cut In MRP: జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
TGSRTC Tour Packages: హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త
Sai Durgha Tej: ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
Woman Maoist surrender: ఆమె తలపై రూ. కోటి రివార్డ్ - ఏకంగా 106 కేసులు  - ప్రాణభయంతో పోలీసుల ఎదుట సరెండర్ అయిన సుజాతక్క !
ఆమె తలపై రూ. కోటి రివార్డ్ - ఏకంగా 106 కేసులు - ప్రాణభయంతో పోలీసుల ఎదుట సరెండర్ అయిన సుజాతక్క !
Paga Paga Paga Movie OTT: మ్యూజిక్ డైరెక్టర్ కోటి విలన్‌గా మూవీ - మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మ్యూజిక్ డైరెక్టర్ కోటి విలన్‌గా మూవీ - మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Force Motors Prices Reduced: జీఎస్టీ కొత్త స్లాబ్స్‌తో రూ.6 లక్షల వరకు తగ్గిన ఫోర్స్ మోటార్స్ ధరలు, మోడల్ వారీగా డిస్కౌంట్స్
జీఎస్టీ కొత్త స్లాబ్స్‌తో రూ.6 లక్షల వరకు తగ్గిన ఫోర్స్ మోటార్స్ ధరలు, మోడల్ వారీగా డిస్కౌంట్స్
Asia Cup 2025 IND vs PAK: భారత్-పాకిస్తాన్ మధ్య మరో హైవోల్టేజ్ మ్యాచ్‌.. ఇప్పటివరకూ టాప్ 5 స్కోరర్స్ వీరే
భారత్-పాకిస్తాన్ మధ్య మరో హైవోల్టేజ్ మ్యాచ్‌.. ఇప్పటివరకూ టాప్ 5 స్కోరర్స్ వీరే
Embed widget