అన్వేషించండి

IPL 2024:బ్యాటింగ్ కు దిగిన రాహుల్ సేన, మరోసారి మాయంక్‌ మాయ చేస్తాడా?

LSG vs GT :గుజరాత్‌ టైటాన్స్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. లక్నోలోని ఎకానా స్టేడియం టాస్ గెలిచిన కెప్టెన్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IPL 2024 LSG vs GT :  ఐపీఎల్‌(IPL)లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) అమీతుమీ తేల్చుకోనుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో  తమ విజయాల జోరును కొనసాగించాలని రాహుల్‌ సేన చూస్తోంది.  టాస్ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లక్నో పేస్‌ సెన్సేషన్ మాయంక్‌ యాదవ్‌పై అందరి దృష్టి  కేంద్రీకృతమైన వేళ... లక్నో పేస్‌కు.. గుజరాత్‌  బ్యాటర్లకు రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన లక్నో మూడో గెలుపుపై కన్నేసింది. కొత్త పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని సత్తా చాటడం లక్నోకు వరంలా మారింది. ఇక గుజరాత్‌ టైటాన్స్‌ లో వృద్ధిమాన్ సాహాకు బదులుగా బి ఆర్ శరత్   తొలిసారి బరిలో దిగనున్నాడు. 

గుజరాత్‌ సమస్యలు తీరేనా..?
కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్‌కు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. రెండు మ్యాచులు గెలిచి రెండు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో 48 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేసిన గిల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. అదే ఫామ్‌ కొనసాగించాలని  గిల్‌ చూస్తున్నాడు. సాయి సుదర్శన్ మంచి టచ్‌లో కనిపించాడు. అయితే భారీ స్కోర్లు నమోదు చేయాలని సుదర్శన్‌ కన్నేశాడు. 

చూపంతా మాయంక్‌పైనే 

 పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల మాయంక్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను తన పేస్‌తో ఆశ్చర్యపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 3/14 గణాంకాలతో ఆర్సీబీ ఓటమికి ప్రధామ కారణమయ్యాడు. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను 151 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించి ఆశ్చర్యపరిచాడు.

హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్‌తో గుజరాత్‌ నాలుగుసార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గుజరాత్ టైటాన్స్ గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకూ ఓడిపోలేదు. 2022 ఛాంపియన్‌ అయిన గుజరాత్‌... లక్నోతో మొత్తం నాలుగు సార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గురజాత్‌ గెలిచింది. ఎకానా స్టేడియంలో 30-32° ఉష్ణోగ్రత ఉంటుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ  రెండు జట్లు ఒకేసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 135 పరుగులు చేసి... లక్నోను 128/7 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది. 

లక్నో జట్టు(అంచనా): క్వింటన్ డి కాక్, KL రాహుల్(కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్

గురాజత్‌ జట్టు (అంచనా):, శుభమాన్ గిల్( కెప్టెన్‌), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget