అన్వేషించండి
Advertisement
IPL 2024: ప్లే ఆఫ్ రేసులో పైకి ఎవరు, పడిపోయేది ఎవరు ?
IPL 2024, DC vs MI : ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీ తుమీ తేల్చుకోనుంది.
IPL 2024 DC vs MI Match Preview and Prediction: ఐపీఎల్(IPL)లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI).. ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో అమీ తుమీ తేల్చుకోనుంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైన ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్ దిశగా మరో అడుగు ముందుకేయాలని చూస్తోంది. మరోవైపు గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిచిన ఢిల్లీ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
ముంబై ఏం చేస్తుందో..?
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆటతీరు అభిమానులు తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఈసీజన్‌లో ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచులు ఆడిన ముంబై... మూడు విజయాలు.. అయిదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
గత నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచ్‌లు గెలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించిన ముంబై జట్టుకు గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. ఢిల్లీతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ముంబై చూస్తోంది. ముంబై బ్యాటర్లు విజృంభిస్తే ఢిల్లీ బౌలర్లకు కష్టాలు తప్పవు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు పరుగులు చేస్తున్నా మిగిలిన బ్యాటర్లు విఫలమవుతున్నారు. టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాణించాలని ముంబై మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ముంబై బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు విఫలమవుతున్నారు. ఇప్పటికే బుమ్రా 6.37 ఎకానమీ రేటుతో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. కానీ గెరాల్డ్ కోయెట్జీ 12 వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.
రిషభ్ పంతే బలం
ఢిల్లీ గత నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో మరింత ముందుకు దూసుకుపోవాలని పంత్ సేన చూస్తోంది. కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి అతిపెద్ద సానుకూలాంశం. కీపింగ్‌లో కూడా పంత్ ఇరగదీస్తున్నాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. జాక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ కూడా మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఓపెనర్ పృథ్వీ షా నుంచి ఢిల్లీ భారీ స్కోరు ఆశిస్తోంది. డేవిడ్ వార్నర్ ఫామ్ కోల్పోవడం ఢిల్లీని కలవరపెడుతోంది. ట్రిస్టన్ స్టబ్స్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గుజరాత్‌పై విజయంలో అక్షర్ పటేల్ తనలోని బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఢిల్లీ స్పిన్ బౌలింగ్ బాగానే ఉన్నా.. పేస్ దళమే బలహీనంగా మారింది. పేసలర్ అన్రిచ్ నార్ట్జే 13.36 సగటుతో పరుగులు ఇవ్వడం ఢిల్లీకి ప్రధాన సమస్యగా మారింది. ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ రాణిస్తే ఢిల్లీ బౌలింగ్ సమస్య తీరినట్లే.
జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యష్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, ఝే రిచర్డ్సన్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్ (వికెట్), అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
తిరుపతి
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement