అన్వేషించండి

IPL 2024: విశాఖ వేదికగా మ్యాచ్ - ఢిల్లీపై రికార్డుల్లోనూ చెన్నైదే ఆధిపత్యం

IPL 2024 Dc Vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటివరకూ మొత్తం 29 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 19 మ్యాచుల్లో విజయం సాధించింది.

IPL 2024 Dc Vs CSK  Head to head records : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో 13వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తలపడనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ Y.S. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి ఏడున్నరకు మ్యాచ్‌ జరగనుంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. రుతురాజ్ గైక్వాడ్‌ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి టైటిల్‌ కల సాకారం దిశగా పయనిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో చెన్నై నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటివరకూ మొత్తం 29 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 19 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్... చెన్నైపై పదిసార్లు గెలిచింది.  గత అయిదు మ్యాచుల్లో చెన్నైపై ఢిల్లీ కేవలం ఒకే విజయం సాధించగా.. చెన్నై నాలుగు సార్లు విజయం సాధించింది.  చెన్నైతో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఘోరంగా ఓడిపోయింది. 91, 27, 77 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ చెత్త రికార్డును చెరిపేసుకోవాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది.

ఢిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్... డైరెక్టర్‌ సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్‌ కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి. పృథ్వీ షా. రికీ భుయ్‌ రాణిస్తే ఢిల్లీ బ్యాటింగ్‌ కాస్త మెరుగవుతుంది. కానీ ఫిట్‌నెస్‌ పూర్తిగా సాధించని పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. డేవిడ్ వార్నర్, కెప్టెన్ రిషబ్ పంత్ గాడిన పడాల్సి ఉంది, మిచెల్ మార్ష్‌పై కూడా ఢిల్లీ ఆశలు పెట్టుకుంది. అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్, దీపక్ చాహర్, మతీషా పతిరాణ, రవీంద్ర జడేజాలతో పటిష్టంగా ఉన్న చెన్నై బౌలింగ్‌ను ఢిల్లీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.  పంత్ విఫలమైతే ధాటిగా ఆడగల దేశీయ క్రికెటర్లు లేకపోవడం ఢిల్లీని వేధిస్తోంది. ఇషాంత్‌శర్మ మళ్లీ జట్టులోకి వస్తే ఢిల్లీ బౌలింగ్‌ కాస్త మెరుగుపడుతుంది. 

జట్లు
చెన్నై: ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‍(కెప్టెన్‌), రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్యా రహానే,  షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్‌, సిమర్జిత్‌ సింగ్‌, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. 

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget