IPL 2023, LSG vs SRH: డేంజరస్ పిచ్‌పై SRH స్కోర్ 121 - లక్నోపై డిఫెండ్ చేస్తారా!
IPL 2023, LSG vs SRH: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ తక్కువ స్కోరే చేసింది. కేఎల్ రాహుల్ సేనకు 122 పరుగుల స్వల్ప టార్గెట్ ఇచ్చింది.
IPL 2023, LSG vs SRH:
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ తక్కువ స్కోరే చేసింది. కేఎల్ రాహుల్ సేనకు 122 పరుగుల స్వల్ప టార్గెట్ ఇచ్చింది. రాహుల్ త్రిపాఠి (34; 41 బంతుల్లో 4x4), అన్మోల్‌ప్రీత్ సింగ్ (31; 26 బంతుల్లో 3x4, 1x6) టాప్ స్కోరర్లు. విపరీతంగా టర్న్ అవుతున్న డేంజరస్ పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు ఆరెంజ్ ఆర్మీ ఇబ్బంది పడింది. కృనాల్ పాండ్య (3/18), అమిత్ మిశ్రా (2/23) తమ స్పిన్‌తో ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ (1/16) చెరో వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 7, 2023
Disciplined bowling by the #LSG bowlers restrict #SRH to a total of 121/8 on the board.
Scorecard - https://t.co/7Mh0bHCrTi #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/YDwKABg2hu
పాండ్య బంతి అందుకోగానే!
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్‌కు మంచి ఓపెనింగే వచ్చింది. అన్మోల్‌ప్రీత్, మయాంక్ అగర్వాల్ (8) కలిసి తొలి వికెట్‌కు 21 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కృనాల్ పాండ్య బంతి పట్టుకున్నాకే పిచ్ ఎంత కఠినంగా ఉందో తెలిసింది. అస్సలు బౌన్స్ లేదు. బంతి ఆగి.. ఆగి.. వస్తోంది. ఎక్కువ డిగ్రీలు టర్న్ అవుతోంది. షాట్లు ఆడేందుకు అస్సలు కుదర్లేదు. దాంతో 2.5వ బంతికే మయాంక్‌ను పాండ్య ఎల్బీ చేశాడు. ఆ తర్వాత త్రిపాఠితో కలిసి రెండో వికెట్‌కు అన్మోల్ 30 బంతుల్లో 29 పరుగుల పాట్నర్ షిప్ అందించాడు. అతడినీ 7.5వ బంతికి పాండ్యనే ఔట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ (0)ను బౌల్డ్ చేశాడు. జట్టు స్కోరు 55 కాస్ట్లీ ప్లేయర్ హ్యారీబ్రూక్ (3)ను రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడి స్టంపౌట్ అయ్యాడు.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, మ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఆదిల్ రషీద్
For his fine bowling figures of 3/18, @krunalpandya24 is our Top Performer from the first innings.
— IndianPremierLeague (@IPL) April 7, 2023
A look at his bowling summary here 👇#TATAIPL #LSGvSRH pic.twitter.com/4Yn3BmM8Cy
ఆఖర్లో అమిత్ మిశ్రా!
కష్టాల్లో పడ్డ సన్‌రైజర్స్‌ను రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ (16; 28 బంతుల్లో) ఆదుకున్నారు. వికెట్లు పడకుండా మెల్లగా ఆడారు. నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 39 రన్స్ పాట్నర్‌షిప్ అందించారు. అయితే జట్టు స్కోరు 94 వద్ద త్రిపాఠిని యశ్ ఠాకూర్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. మరికాసేపటికే వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్ (4)ను అమిత్ మిశ్రా పెవిలియన్ పంపించాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ (21*; 10 బంతుల్లో 1x4, 2x6) మెరుపు షాట్లు ఆడి స్కోరును 121/8కు చేర్చాడు. చివరి ఓవర్లో ఉనద్కత్ రెండు సిక్సర్లు ఇవ్వకపోతే లక్నో టార్గెట్ ఇంకా తక్కువే అయ్యేది.
ICYMI - A brilliant diving catch by @MishiAmit ends Rahul Tripathi's stay out there in the middle.#TATAIPL #LSGvSRH pic.twitter.com/uJkjykYlJt
— IndianPremierLeague (@IPL) April 7, 2023