IPL 2023 Points Table: రాజస్తాన్ టాప్‌కి - చెన్నై థర్డ్ ప్లేస్‌కి - పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే?
ఐపీఎల్ 2023లో రాజస్తాన్ చేతిలో చెన్నై ఓటమి పాలవడంతో పాయింట్ల పట్టికలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
IPL 2023: IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ 32 పరుగుల తేడాతో సీఎస్కేని ఓడించింది. ఈ సీజన్‌లో చెన్నైపై రాజస్థాన్ రెండోసారి విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కూడా భారీ మార్పు కనిపించింది. ఈ ఓటమితో చెన్నై నంబర్‌వన్ స్థానాన్ని చేజార్చుకుంది. అదే సమయంలో ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానానికి పడిపోయింది.
ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది. వారి నెట్ రన్‌రేట్ +0.662గా ఉంది. కానీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో నిలిచింది. సంజూ శామ్సన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు 8 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించి నంబర్ వన్‌గా ఉంది. రాజస్తాన్ +0.939 నెట్ రన్‌రేట్‌తో మొదటి స్థానంలో నిలిచింది.
పాయింట్ల పట్టికలో టాప్ 5 జట్లు ఇవే
గుజరాత్ టైటాన్స్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేసి రెండో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ 10 పాయింట్లతో +0.580 నెట్ రన్‌రేట్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ తాము ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి 10 పాయింట్లు సంపాదించింది. +0.376 నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానంలో నిలిచింది.
లక్నో సూపర్ జెయింట్స్ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించింది. +0.547 నెట్ రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. ఆర్సీబీ దగ్గర ఎనిమిది పాయింట్లు, -0.139 నెట్ రన్‌రేట్ ఉన్నాయి.
మిగతా జట్ల పరిస్థితి ఏంటి?
కాగా పంజాబ్ కింగ్స్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించింది. -0.162 నెట్ రన్‌రేట్‌తో ఆరో స్థానంలో నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు సంపాదించారు. -0.027 నెట్ రన్‌రేట్‌తో ఏడో స్థానంలో ఉన్నారు.
ఇక ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాల్లో ఆరు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ముంబై నెట్ రన్‌రేట్ -0.620గా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది. -0.725 నెట్ రన్‌రేట్‌తో తొమ్మిదో స్థానంలో నిలిచింది. పదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది. -0.961 నెట్ రన్‌రేట్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ 10వ స్థానంలో నిలిచింది.
.@rajasthanroyals return to winning ways! 👏 👏
— IndianPremierLeague (@IPL) April 27, 2023
The @IamSanjuSamson-led unit beat #CSK by 32 runs to seal their 5⃣th win of the #TATAIPL 2023 👍 👍
Scorecard ▶️ https://t.co/LoIryJ4ePJ#RRvCSK pic.twitter.com/CRCDTHd8m8
Adam Zampa scalped 3⃣ wickets and was the top performer from the second innings of the #RRvCSK clash. 👌👌 #TATAIPL | @rajasthanroyals
— IndianPremierLeague (@IPL) April 27, 2023
A summary of his bowling performance 🔽 pic.twitter.com/pjKVgcFmzu