RCB vs KKR: మళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీనే - టాస్ కూడా గెలిచాడు!
RCB vs KKR: ఐపీఎల్ 2023లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. చిన్నస్వామి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచింది.
![RCB vs KKR: మళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీనే - టాస్ కూడా గెలిచాడు! IPL 2023 RCB vs KKR Royal Challengers Bangalore opted to field against kolkata knight riders RCB vs KKR: మళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీనే - టాస్ కూడా గెలిచాడు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/bf9ab938da32bbc8cac82b8d61c9a7b91682516529802251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
RCB vs KKR, IPL 2023:
ఐపీఎల్ 2023లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. చిన్నస్వామి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫాప్ డుప్లెసిస్ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ ప్లే చేస్తాడని అన్నాడు.
'మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. చిన్నస్వామిలో రాత్రి మ్యాచ్ అంటే ఆలోచించాల్సిన పన్లేదు. మేమిక్కడ విజయవంతంగా లక్ష్యాలను ఛేదిస్తున్నాం. అనుకోకుండా కెప్టెన్సీ చేయాల్సి వస్తోంది. మా ఆటతీరును చూస్తుంటే సరదాగా అనిపిస్తోంది. డుప్లెసిస్ మళ్లీ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తాడు. తర్వాతి మ్యాచ్ నుంచి అతడే కెప్టెన్సీ చేస్తాడని అనుకుంటున్నాం. పిచ్ ఎప్పట్లాగే చాలా బాగుంది' అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
'టోర్నమెంటులో రెండో దశ మొదలైంది. ఇది మాకు కీలక మ్యాచ్. కొన్నిసార్లు బాగా ఆడాం. కొన్నిసార్లు ఆడలేకపోయాం. ఇక మేము గట్టిగా పోరాడాల్సిన తరుణం వచ్చేసింది. మేమంత సమష్టిగా ఆడితే ఫలితం కచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుంది. కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. శార్దూల్, గుర్బాజ్ గాయపడ్డారు. ఒక మార్పు చే్సతున్నాం. కుల్వంత్ స్థానంలో వైభవ్ అరోరా వస్తాడు' అని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా అన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహిపాల్ లోమ్రర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్
కోల్‌కతా నైట్‌రైడర్స్: జగదీశన్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
కోహ్లీ కెప్టెన్సీతో జోష్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (Royal Challengers Bangalore) విరాట్ కోహ్లీ (Virat Kohli) జోష్ తీసుకొస్తున్నాడు. డుప్లెసిస్‌కు ఫిట్‌నెస్ ఇబ్బందులు ఉండటంతో చివరి రెండు మ్యాచుల్లో సారథ్యం వహించాడు. తనదైన అగ్రెషన్‌తో రెండింట్లోనూ విజయం అందించాడు. ఏదేమైనా టాప్ ఆర్డర్ ఆడినంత వరకు ఆర్సీబీకి ఫర్వాలేదు. జట్టు చేసిన మొత్తం పరుగుల్లో కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్‌వెల్ వాటానే ఎక్కువ! మిడిల్ నుంచి లోయర్ వరకు ఎవరూ కంట్రిబ్యూట్ చేయడం లేదు. కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్, నరైన్ ఈ ముగ్గుర్నీ ఔట్ చేస్తే ఇబ్బందులు తప్పవు. బౌలింగ్ యూనిట్ మాత్రం ఫర్వాలేదు. మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) కెరీర్‌లోనే బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. స్క్రాంబుల్ సీమ్‌తో పవర్‌ప్లేలో వికెట్లు అందిస్తున్నాడు. టైట్ లెంగ్తుల్లో బంతులేస్తున్నాడు. హర్షల్ పటేల్ తోడుగా ఉన్నాడు. హసరంగ తన స్పిన్‌తో మాయాజాలం చేస్తున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ వస్తే తిరుగుండదు.
🚨 Toss Update 🚨@RCBTweets win the toss & elect to field first against @KKRiders.
— IndianPremierLeague (@IPL) April 26, 2023
Follow the match ▶️ https://t.co/o8MipjFd3t #TATAIPL | #RCBvKKR pic.twitter.com/uSRkTWuzxQ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)