News
News
వీడియోలు ఆటలు
X

IPL 2023: 55 మ్యాచ్‌లు పూర్తయినా ప్లేఆఫ్స్ బెర్తుల్లో నో క్లారిటీ - అత్యంత కష్టమైన ఐపీఎల్ సీజన్ ఇదే!

2023 ఐపీఎల్‌లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కానీ ప్లేఆఫ్స్ సమీకరణం మాత్రం తేలలేదు.

FOLLOW US: 
Share:

IPL 2023 Playoff Qualification: ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు జరిగాయి. నెమ్మదిగా లీగ్ ముగింపు దిశగా సాగుతోంది. అయితే దాదాపు మొత్తం 10 జట్లు ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. గత సీజన్ విజేత గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ 9, 10 స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్‌లో ఏ జట్లకు ఎక్కువ అర్హతలు ఉన్నాయో చూద్దాం.

గుజరాత్ టైటాన్స్
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌లు గెలిచింది. 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో పాండ్యా అండ్ కో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయం అయినట్లే. గుజరాత్ తన మిగిలిన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోయినప్పటికీ అది నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్
ఢిల్లీపై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఇప్పుడు ధోని సేన ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని చేర్చుకోవాలంటే కేవలం ఒక విజయం మాత్రమే కావాలి. 12 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తదుపరి రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ముంబై ఇండియన్స్
ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్ తమ పాత స్టైల్‌లోనే కనిపించారు. తొలి ఓటమి తర్వాత ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది కాబట్టి రెండు విజయాలు కొనసాగిస్తే రోహిత్ శర్మ అండ్ కో టాప్ 4లో స్థానం దక్కించుకుంటుంది. జట్టు నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఆరు వికెట్లతో విజయం సాధించడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సమీకరణం చాలా స్పష్టంగా మారింది. 11 మ్యాచ్‌ల నుంచి 11 పాయింట్లతో, జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (నెట్ రన్‌రేట్ +0.294) ఉంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఇప్పుడు ఒక్క ఓటమి కూడా లక్నో కష్టాలను పెంచుతుంది.

రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ తర్వాతి మూడు మ్యాచ్‌లు కోల్‌కతా, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్‌లతో జరగనున్నాయి. సంజూ శామ్సన్ అండ్ కో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. రాజస్తాన్ ఇప్పటి వరకు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 5 గెలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్
ప్రస్తుత సీజన్‌‌లో కోల్‌కతాకు మెరుగ్గా ఆడిందేమీ లేదు. ఇప్పటి వరకు ఆ జట్టు 11 మ్యాచ్‌లు ఆడగా అందులో ఐదిట్లో గెలిచింది. జట్టు 10 పాయింట్లను కలిగి ఉంది. నెట్ రన్ రేట్ -0.079గా ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ తన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే 16 పాయింట్లు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో వారు ప్లే ఆఫ్‌కు చేరుకోవడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
RCB కూడా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచింది. 10 పాయింట్లను కలిగి ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఆ జట్టు 16 పాయింట్లను సొంతం చేసుకుంటుంది. కానీ ఆ జట్టు నెట్ రన్ రేట్ -0.345 కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌లు రాజస్థాన్, హైదరాబాద్, గుజరాత్‌లతో ఉంటాయి. వీటిలో ఒక్క ఓటమి ఎదురైనా వారు ప్లేఆఫ్‌కు దూరం అయ్యే ప్రమాదం ఉంది.

పంజాబ్ కింగ్స్
లక్నో, రాజస్థాన్, ఆర్‌సీబీ, కోల్‌కతా తరహాలోనే పంజాబ్ కూడా ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచింది. 10 పాయింట్లతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పంజాబ్ కూడా తన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లేఆఫ్ రేసులో ఉంటుంది. కానీ నెట్ రన్ రేట్ (-0.441) తక్కువగా ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్
హైదరాబాద్ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మాత్రమే గెలిచింది. ఇతర జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్ ఒక మ్యాచ్ తక్కువగా ఆడింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఆ జట్టు 16 పాయింట్లను సొంతం చేసుకుంటుంది. హైదరాబాద్ నెట్ రన్ రేట్ (-0.472) తక్కువగా ఉంది. కాబట్టి జట్టు ఆ వైపు కూడా దృష్టి పెట్టాలి.

ఢిల్లీ క్యాపిటల్స్
డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఢిల్లీ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా అందులో నాలుగు గెలిచింది. ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే 14 పాయింట్లు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఢిల్లీ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

Published at : 11 May 2023 09:40 PM (IST) Tags: Delhi Capitals IPL 2023 SunRisers Hyderabad IPL 2023 Playoff Qualification

సంబంధిత కథనాలు

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

IPL 2023: ఫ్యూచర్లో CSK ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ - ఆ రూల్‌ వర్తించదన్న సెహ్వాగ్‌!

IPL 2023: ఫ్యూచర్లో CSK ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ - ఆ రూల్‌ వర్తించదన్న సెహ్వాగ్‌!

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!

IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!

టాప్ స్టోరీస్

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్