IPL 2023: ఐదేళ్ల తర్వాత కలవనున్న రహానే, ధోని, స్టోక్స్ - పుణే తర్వాత చెన్నైకే!
ఐపీఎల్ 2023లో ధోని, రహానే, బెన్ స్టోక్స్ ఒకే జట్టుకు కలిసి ఆడనున్నారు.
IPL 2023: ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు మినీ వేలం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బిడ్డింగ్ ఈ వేలంలో జరిగింది. ఇంగ్లిష్ ఆల్ రౌండర్ శామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇది కాకుండా మరో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పాటు భారత ఆటగాడు అజింక్యా రహానెను కూడా చెన్నై జట్టులో చేర్చుకుంది.
ఐదేళ్ల తర్వాత కలిసిన ధోనీ, స్టోక్స్, రహానే
ఐపీఎల్‌లో ఐదేళ్ల తర్వాత బెన్ స్టోక్స్, అజింక్యా రహానే, మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి ఒకే జట్టులో భాగమయ్యారు. IPL 2023లో ఈ ముగ్గురు ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడతారు. ఇంతకుముందు 2017 ఐపీఎల్ సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున వీరు కలిసి ఆడారు.
ఈసారి కొత్త లుక్‌లో చెన్నై
IPL 2022లో చెన్నై చాలా చెడ్డ స్థితిలో కనిపించింది. తొమ్మిదో స్థానంలో IPLను ముగించింది. 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈసారి మినీ వేలం ద్వారానే జట్టు తన ఉద్దేశాలను స్పష్టం చేసింది. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు.
ఐపీఎల్ 2022 కోసం జట్టులో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు గొప్ప ఆల్ రౌండర్లు ఉన్నారు. దీంతోపాటు జట్టు బ్యాటింగ్, బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవాలనే ఉద్దేశంతో సీఎస్‌కే ఈసారి మైదానంలోకి దిగనుంది.
View this post on Instagram
View this post on Instagram