By: ABP Desam | Updated at : 29 Mar 2022 05:58 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఆడీ ఓడిన RCB, ఛాంపియన్‌పై గెలిచిన KKR - ఈ పోరు మాములూగా ఉండదు బాసూ! @ RCB, KKR Twitter
IPL 2022 RCB vs KKR match preview: ఐపీఎల్ 2022 ఆరో మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders) తలపడుతున్నాయి. డీవై పాటిల్ స్టేడియంలో (DY Patil Stadium) జరిగే ఈ మ్యాచుపై భారీ అంచనాలే ఉన్నాయి. కేకేఆర్ (KKR) తన తొలి మ్యాచులో విజయంతో మురిసింది. ఇదే జోష్‌ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. మరోవైపు డుప్లెసిస్ నాయకత్వంలో వీర బాదుడు బాదినా ఓటమి తప్పించుకోలేని ఆర్‌సీబీ (RCB) కసితో రగిలిపోతోంది. మరి వీరిద్దరిలో గెలుపు ఎవరిని వరించనుందో?
KKR ఆల్‌రౌండ్ షో
ఐపీఎల్ మొదటి మ్యాచులో కేకేఆర్‌కు టాస్ రూపంలో అదృష్టం వరించింది! డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఛేదన సులభంగా మారింది. తొలుత స్పాంజీ బౌన్స్‌ను ఉపయోగించుకొని సీఎస్‌కేను 131కే పరిమితం చేసింది. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ టార్గెట్ ఛేదించింది. పేసర్ ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) తన బౌలింగ్‌కు మరింత పదును పెట్టుకోవడం ప్లస్ పాయింట్. అలాగే వరుణ్ చక్రవర్తి (Varun chakravarthy) , సునిల్ నరైన్ (Sunil Narine) స్పిన్ జోడీ ప్రత్యర్థులకు ప్రమాదకరంగా మారిపోయింది. బెంగళూరుకు, స్పెషల్లీ కోహ్లీకి (Virat Kohli) వీరితో ముప్పు తప్పదు!
శివమ్ మావి, రసెల్ (Andre Russell) కాస్త పరుగుల్ని నియంత్రించాలి. ఇక బ్యాటింగ్‌లో కేకేఆర్ బలంగా కనిపిస్తోంది. ముంబయి, మహారాష్ట్ర పరిస్థితులపై అనుభవం ఉన్న అజింక్య రహానె (Ajinkya Rahane), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) రెచ్చిపోతున్నారు. నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్ స్ట్రైక్‌ను చక్కగా రొటేట్ చేస్తున్నారు. వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) భారీ షాట్లు ఆడటం మొదలు పెడితే ఇక కేకేఆర్‌కు తిరుగుండదు. టాప్‌ఆర్డర్ ఆడిందంటే ఆఖర్లో ఆండ్రీ రసెల్ అవతలి వారిని బతకనివ్వడు.
RCB బ్యాటింగ్ అదుర్స్.. బౌలింగ్ బెదుర్స్
తొలి మ్యాచులో ఓటమి పాలైనప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటింగ్ మాత్రం అందరినీ ఉర్రూతలూగించింది. మొదట్లో ఆచితూచి ఆడిన ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ (Faf du plessis) ఐదో ఓవర్ తర్వాత స్టేడియం చుట్టూ సిక్సర్లు, బౌండరీల వరద పారించాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లీ (Virat Kohli) బాదిన సిక్సర్లు ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాయి. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. టాప్ టు మిడిలార్డర్ అంతా ఫామ్‌లో ఉండటం ఆర్‌సీబీకి హ్యాపీ. మాక్సీ (maxwell) వచ్చేశాడంటే ఇక తిరుగుండదు. మంచి బౌలర్లే ఉన్నప్పటికీ డ్యూ ఫ్యాక్టర్ వారికి చేటు చేసింది. సిరాజ్ (Mohammed Siraj) 4 ఓవర్లలో 59 పరుగులిచ్చి 2 వికెట్లే తీశాడు. ఆకాశ్ దీప్, హసరంగ, హర్షల్ పటేల్ (Harshal Patel) ఎకానమీ మరీ ఎక్కువగా ఉంది. వీరంతా టైట్ లైన్స్‌లో బౌలింగ్ చేస్తే గెలుపు బాట పట్టొచ్చు.
DY Patilలో టాసే కీలకం
డీవై పాటిల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. మొదటి ఐదు ఓవర్లు వికెట్ పోకుండా ఆడితే తర్వాత పరుగుల వరద పారించొచ్చు. ఇక్కడి బౌండరీలు చిన్నవి. బాల్ బ్యాటు మీదకు వస్తోంది. రెండో బ్యాటింగ్ మరింత ఈజీగా ఉంటోంది. అయితే బౌలర్లు లైట్ లైన్స్‌లో వేస్తే పరుగులను నియంత్రించొచ్చు.
R Ashwin: 'ఐపీఎల్ వార్‌ఫేర్'పై స్పందించిన యాష్ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్
Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్ పదవికి గంభీర్ రిజైన్ చేస్తున్నాడా!
IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?
Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు
MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?
Chandrababu Naidu Arrest : చంద్రబాబు కేసుల్లో కక్ష సాధింపు లేదు - కోర్టే రిమాండ్ విధించింది - సజ్జల కీలక వ్యాఖ్యలు
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
/body>