By: ABP Desam | Updated at : 31 Mar 2022 05:09 PM (IST)
Edited By: Ramakrishna Paladi
కేఎల్ రాహుల్ ధోనీసేనను ఊచకోత కోసింది గుర్తుందా? KL ముందర మరో రికార్డు!
KL Rahul performance against csk in 2021: లక్నో సూపర్‌జెయింట్స్ (Lucknow Supergiants) కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో (Chennai Superkings) నేడు జరిగే మ్యాచులో ఒక అర్ధశతకం చేస్తే చాలు! టీ20 క్రికెట్లో 50 అర్ధసెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత అందుకుంటాడు. మరో 2 బాదితే 500 బౌండరీల ఘనతకు చేరుకుంటాడు.
అంతర్జాతీయంగా టీ20 క్రికెట్లో కేఎల్ రాహుల్ (KL Rahul)కు తిరుగులేదు. కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) అతడు నిలకడగా రాణిస్తున్నాడు. మూడేళ్లుగా కనీసం 600 పరుగులు చేస్తున్నాడు. 2019లో 53.9 సగటుతో 593 పరుగులు చేశాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2020లో 55.8 సగటుతో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2021లోనూ 62.6 సగటుతో 626 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇందుకోసం 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు.
కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 173 టీ20 (ఐపీఎల్, అంతర్జాయతీ, దేశవాళీ)లు ఆడాడు. 43 సగటు, 137 స్ట్రైక్‌రేట్‌తో 5742 పరుగులు చేశాడు. 49 అర్ధశతకాలు, 498 బౌండరీలలు బాదేశాడు. నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచులో మరో అర్ధశతకం చేస్తే 50 హాఫ్ సెంచరీల రికార్డు సాధిస్తాడు. దాంతో ఆటోమేటిగ్గానే 500 బౌండరీల రికార్డూ వచ్చేస్తుంది.
సీఎస్‌కేతో (CSK) మ్యాచుకు ముందు అభిమానులు గతేడాది ధోనీసేనపై రాహుల్ దూకుడును గుర్తు చేసుకుంటున్నారు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదట సీఎస్‌కే 134/6 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 13 ఓవర్లలోపే పూర్తి చేసింది. ఈ పోరులో కేఎల్ రాహుల్ 42 బంతుల్లోనే 7 బౌండరీలు, 8 సిక్సర్లతో అజేయంగా 98 పరుగులు చేశాడు. ఏకంగా 234 స్ట్రైక్‌రేట్‌తో దంచికొట్టాడు. ఈ రోజు జరిగే మ్యాచులోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
KL Rahul with the bat in IPL:
— Wisden India (@WisdenIndia) March 31, 2022
2021 - 626 runs @ 62.6
2020 - 670 runs @ 55.8
2019 - 593 runs @ 53.9
He is scoring runs constantly for his team in IPL 🔥#KLRahul #LSG #IPL2022 #CSKvLSG #Cricket pic.twitter.com/x8Cninzfyw
This one felt like a win because of the way we fought.
— K L Rahul (@klrahul11) March 29, 2022
Proud 💙🙏🏽@LucknowIPL pic.twitter.com/mNXuy6sLfo
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!
IPL 2022 Final: ఐపీఎల్ ఫైనల్.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!
RR vs RCB, Qualifier 2: ఈ లెగ్ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!