GT Vs SRH Toss Update: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ - ఇవాళ కూడా ‘రైజ్’ అవుతారా?

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

FOLLOW US: 

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తలపడుతున్నాయి. వాంఖడే వేదికగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లూ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాయి.

అంచనాల్లేకుండా వచ్చి...
సీజన్‌ ఆరంభానికి ముందు గుజరాత్‌ టైటాన్స్ జట్టుపై ఎవరికీ అంచనాల్లేవు! బ్యాటింగ్‌లో డెప్త్‌ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు అలాంటి జట్టే ఏడు మ్యాచ్‌ల్లో ఆరిట్లో గెలిచి రికార్డు సృష్టించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తొలి రెండు మ్యాచుల్లో ఓడి నిరాశపరిచినా... తర్వాత వరుసగా ఐదు విజయాలు అందుకుంది. గుజరాత్ టైటాన్స్‌కు ఈ సీజన్‌లో ఓటమి రుచి చూపించిన ఏకైక జట్టు సన్‌రైజర్సే.

రెండు జట్లకు బౌలింగే బలం...
గుజరాత్‌ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (GT vs SRH) బౌలింగ్‌ యూనిట్లు అత్యంత బలంగా ఉన్నాయి. గుజరాత్ ఇన్ని విజయాలు సాధించిందంటే అందుకు బౌలర్లే ప్రధాన కారణం. లోకీ ఫెర్గూసన్‌, మహ్మద్‌ షమీ, అల్జారీ జోసెఫ్‌, రషీద్‌ ఖాన్‌ ప్రత్యర్థిని తక్కువ స్కోర్లకే పరిమితం చేస్తున్నారు. డెత్ ఓవర్లలో పరుగులు తక్కువగా ఇవ్వడంతో పాటు వికెట్లు కూడా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మలిక్‌, మార్కో జాన్‌సెన్‌, నటరాజన్‌లు చురకత్తుల్లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు సవాళ్లు విసురుతున్నారు. బౌలింగ్‌ పరంగా గుజరాత్, హైదరాబాద్ జట్లకు పెద్దగా ఇబ్బందేమీ లేదు. ఈ సీజన్లో అత్యుత్తమ బౌలింగ్‌ సగటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (20.69), గుజరాత్ టైటాన్స్‌ (25.79) జట్లదే.

బ్యాటింగ్‌లో కూడా రైజింగే...
అయితే బ్యాటింగ్‌లో మాత్రం గుజరాత్ టైటాన్స్‌తో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాదే బాగుంది. వన్‌డౌన్‌లో ఆడుతున్న రాహుల్‌ త్రిపాఠి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఎయిడెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, అభిషేక్‌ శర్మ అవసరం అయినప్పుడు రాణిస్తున్నారు. కేన్‌ విలియమ్సన్ ఫాంలోకి వస్తే ఇక తిరుగుండదు. గుజరాత్ టైటాన్స్‌ మాత్రం పూర్తిగా హార్దిక్‌ పాండ్యాపైనే ఆధారపడుతోంది. అతను విఫలమైతే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

గుజరాత్‌ టైటాన్స్‌ తుదిజట్టు
శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్), డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, అభినవ్‌ మనోహర్‌, రషీద్‌ ఖాన్‌, అల్జారీ జోసెఫ్‌, లోకీ ఫెర్గూసన్‌, మహ్మద్‌ షమి, యశ్‌ దయాళ్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తుదిజట్టు
కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్), అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్ కీపర్), శశాంక్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్, మార్కో జన్‌సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, టి నటరాజన్‌

Published at : 27 Apr 2022 07:15 PM (IST) Tags: IPL SRH IPL 2022 Sunrisers Hyderabad Gujarat Titans GT gt vs srh GT Vs SRH Toss

సంబంధిత కథనాలు

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!

RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!

IPL 2022 Final: ఐపీఎల్‌ ఫైనల్‌.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!

IPL 2022 Final: ఐపీఎల్‌ ఫైనల్‌.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!

RR vs RCB, Qualifier 2: ఈ లెగ్‌ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!

RR vs RCB, Qualifier 2: ఈ లెగ్‌ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!

టాప్ స్టోరీస్

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్