అన్వేషించండి

IPL 2024: విల్‌ జాక్స్‌ శతక గర్జన, బెంగళూరు ఘన విజయం

GT vs RCB, IPL 2024: ఐపీఎల్‌లో ఆలస్యంగా పుంజుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. విల్‌ జాక్స్‌  మెరుపు శతకంతో మెరవడంతో గుజరాత్‌ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది.

GT vs RCB  IPL 2024 Royal Challengers Bengaluru won by 9 wkts: ఐపీఎల్‌(IPL)లో ఆలస్యంగా పుంజుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)... వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. విల్‌ జాక్స్‌  మెరుపు శతకంతో మెరవడంతో గుజరాత్‌ టైటాన్స్‌(GT)పై ఘన విజయం సాధించింది. విల్‌ జాక్స్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేశాడు. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో సిక్స్‌ కొట్టిన జాక్స్‌... శతక గర్జన చేశాడు. విరాట్‌ కోహ్లీ కూడా అద్భుత అర్థ శతకంతో మరోసారి రాణించాడు. దీంతో 200 పరుగుల లక్ష్యాన్ని మరో 24 బంతులు మిగిలి ఉండగానే కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి... బెంగళూరు సునాయసంగా ఛేదించింది.
 
సుదర్శన్ పోరాటం
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా 5 పరుగులకే ఔటయ్యాడు. స్వప్నిల్ బౌలింగ్‌లో కర్ణ్ శర్మకు క్యాచ్‌ ఇచ్చి సాహా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 6 పరుగుల వద్ద గుజరాత్‌ మొదటి వికెట్‌ను కోల్పోయింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్‌కు పరుగులు రావడం కష్టమైపోయింది. గత మ్యాచుల్లో తేలిపోయిన బెంగళూరు బౌలింగ్‌ ఆరంభంలో కాస్త గాడినపడ్డారు. యశ్ దయాల్ వేసిన 4వ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. పవర్‌ ప్లేలో గుజరాత్ ఒక వికెట్‌ నష్టానికి కేవలం 42 పరుగులే చేసింది. 45 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో కామెరూన్‌ గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి 16 పరుగులు చేసి శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 82/2. కామెరూన్ గ్రీన్ వేసిన 11 ఓవర్‌లో షారుక్ ఖాన్ సిక్స్ బాదాడు. షారుక్ ఖాన్‌ ఉన్నంతవరకూ ధాటిగా ఆడాడు. 24 బంతుల్లోనే షారుక్ ఖాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 13 ఓవర్‌లో వరుసగా 4, 4, 6 బాదేసి 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. షారుక్‌కు ఐపీఎల్‌లో ఇది తొలి హాఫ్‌ సెంచరీ. 30 బంతుల్లో మూడు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 58 పరుగులు చేసి షారూఖ్‌ఖాన్‌ అవుటయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో షారూక్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరోవైపు సాయి సుదర్శన్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 34 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  సాయి సుదర్శన్‌ 49 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి సరిగ్గా 200 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌ ఒకటి, మహ్మద్‌ సిరాజ్‌ ఒకటి, మ్యాక్స్‌వెల్‌ ఒక వికెట్‌ తీశారు.
 
కోహ్లీ, జాక్స్‌ ధనాధన్‌
201 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 40 పరుగుల వద్ద ఫాఫ్‌ డు ప్లెసిస్‌ అవుటయ్యాడు. గుజరాత్‌ బౌలర్లకు ఇదొక్కటే ఓదార్పు. ఆ తర్వాత కోహ్లీ, విల్‌ జాక్స్‌ మరో వికెట్‌ పడకుండా బెంగళూరుకు విజయాన్ని అందించారు. కోహ్లీ 44 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. విల్‌ జాక్స్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేశాడు. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో సిక్స్‌ కొట్టి జాక్స్‌ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరి విధ్వంసంతో మరో మరో 24 బంతులు మిగిలి ఉండగానే కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి... బెంగళూరు సునాయసంగా ఛేదించింది.

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget