IPL 2024: రికార్డులన్నీ చెన్నై పేరు మీదే, కోల్‌కత్తా బద్దలు కొడుతుందా ?
CSK vs KKR : 2008 నుంచి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య 31 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై 19సార్లు విజయం సాధిస్తే... కోల్‌కత్తా 11 మ్యాచుల్లో విజయం సాధించింది.
CSK vs KKR IPL 2024 Head to Head records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 22వ మ్యాచ్‌లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయంపాలైన చెన్నై ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. విశాఖపట్నంలో IPL చరిత్రలోనే కోల్‌కత్తో రెండో అత్యధిక స్కోరును సాధించింది, 273 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ను 166 పరుగులకు ఆలౌట్ చేసి 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. IPL 2024 పాయింట్ల పట్టికలో, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కత్తా జట్టు రెండో స్థానంలో ఉంది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది, చెన్నై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించింది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్
2008 నుంచి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య 31 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై 19సార్లు విజయం సాధిస్తే... కోల్‌కత్తా 11 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచులో ఎలాంటి ఫలితం రాలేదు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి ఆరు మ్యాచుల్లో చెన్నై నాలుగు సార్లు గెలవగా కోల్‌కత్తా రెండుసార్లు గెలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్లు 10 మ్యాచులు ఆడగా చెన్నై ఏడుసార్లు విజయం సాధించగా.... కోల్‌కత్తా మూడు విజయాలు నమోదు చేసింది. మొత్తంగా చెపాక్ మైదానంలో చెన్నై 66 మ్యాచులు ఆడగా 47 విజయాలు నమోదు చేసింది. 18 మ్యాచుల్లో ఓడిపోయింది. చెపాక్‌లో కోల్‌కత్తా 13 మ్యాచులు ఆడగా నాలుగు మ్యాచుల్లో గెలిచి 9 సార్లు ఓడిపోయింది.
పిచ్ ఎలా ఉంటుందంటే..?
చెపాక్ ఫాస్ట్ బౌలర్‌లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ ఐపీఎల్‌లో చెపాక్‌లో సీమర్లు 28 సగటుతో 18 వికెట్లను తీశారు. స్పిన్నర్లు నాలుగు వికెట్లు మాత్రమే తీశారు. IPL 2024లో చెపాక్‌లో సగటు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 189. గత మూడేళ్లలో 21 మ్యాచ్‌ల్లో సగటు స్కోరు 164. కోల్‌కత్తా ఈ ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో ఓవర్‌కి 12 పరుగులతో దూసుకుపోతోంది. కాబట్టి కోల్‌కత్తా బ్యాటర్లు కాస్త ఓపిక ప్రదర్శిస్తే భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం ఉంది.
చెన్నై జట్టు: MS ధోని, అరవెల్లి అవనీష్, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, మిచెల్ రవీంద్ర, మిచెల్ రవీంద్ర నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ మరియు సమీర్ రిజ్వీ.
కోల్‌కత్తా జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), KS భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ చక్రవర్తి చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్.