అన్వేషించండి

IPL 2024: ముంబై ఫ్యాన్స్ దాడిలో గాయపడిన సీఎస్‌కే అభిమాని మృతి

CSK Fan Passed Away : రెండు రోజుల కిందట ముంబై ఇండియన్స్‌ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమాని అసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న (మార్చి 31) మృతి చెందాడు.

CSK Fan Murdered by two MI Fans:  ఐపీఎల్ (IPL)మ్యాచ్‌లో తలెత్తిన తీవ్ర వాగ్వాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల ముంబై ఇండియన్స్‌(MI) అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) ఫ్యాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న (మార్చి 31) మృతి చెందాడు. రోహిత్ శర్మ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్నందుకు కొందరు అభిమానులు ఆ వ్యక్తి తల పగలకొట్టారు.  వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
ముంబై వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్ 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కొంత‌మంది ఒక‌చోట చేరి హైద‌రాబాద్‌, ముంబై మ్యాచ్‌ను చూశారు. వీరిలో కొంత‌మంది సీఎస్‌కే అభిమానులుంటే, మ‌రికొంత మంది ముంబై ఫ్యాన్స్ ఉన్నారు.  వీరిలో బందోపంత్‌ బాపూసో తిబిలే అనే వ్యక్తి చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని. సాగర్‌ సదాశివ్‌ జంజగే, బల్వంత్‌ మహదేవ్‌ జంజగే ముంబై అభిమానులు.  వీరంతా కలిసి మార్చి 27న జరిగిన ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ను టీవీలో చూశాడు. 
 
హేళనగా మాట్లాడినందుకు వివాదం..
హైదరాబాద్ ఇచ్చిన 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు అద్భుత శుభారంభం అందించారు. అయితే అతి తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు పడ్డాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్ పతనం ముంబై ఇండియన్స్ శిబిరాన్ని షాక్ కు గురి చేసింది.  ఫాన్స్ కూడా హర్ట్ అయ్యారు . అప్పుడే  సీఎస్‌కే అభిమాని అయిన తిబిలే , ముంబై ఇండియన్స్‌ అభిమానులైన సాగర్‌, బల్వంత్‌లతో హేళనగా మాట్లాడాడు. కోపంతో వీరిద్దరూ   తిబిలేతో వాగ్వాదానికి దిగారు. క్రమేపీ ఈ గొడవ ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే గొడవ తీవ్రరూపం దాల్చడంతో సాగర్, బల్వంత్ లు పక్కనే  ఉన్న కర్రలు అందుకుని బండుపంత్‌ తిబిలేతలపై తీవ్రంగా కొట్టారు. దీంతో  అతని చెవులు, ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైంది.  తలకు బలమైన గాయమై స్పృహతప్పి నేలపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన తిబిలే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తిబిలే ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచాడు. .  టిబిల్‌కు భార్య,  వివాహితులైన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నిందితులు సాగర్ జాంగే, బల్వంత్ జాంగేలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్  జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్ జట్టు విజయం సాధించింది. అయితేనేం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం  విశాఖలో దుమ్మురేపాడు. పాత ధోనీని తలపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు.  విధ్వంసకర బ్యాటింగ్‌తో పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను వణికించాడు.   ఆకాశమే హద్దుగా చెలరేగి 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ ఈ విశాఖ మైదానాన్ని హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్నా  గ్రౌండ్‌ అంతా పసుపుమయం అయిపోయింది. మ్యాచ్ గెలుపు ఢిల్లీదే అయినా ధోనీ మానియాతో అభిమానులు ఊగిపోయారు. మహేంద్ర సింగ్ ధోని జోరు చూశాక.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఖచ్చితంగా  గెలిచే అవకాశాలు ఉండేవి. 

 

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget