అన్వేషించండి

Arshdeep Singh News: అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యాడు. 11 బంతుల సుదీర్ఘ ఓవర్‌తో పాటు భారీగా పరుగులు సమర్పించుకుని జట్టును కష్టాల్లో నెట్టాడు.

IPL 2026 PBKS VS GT Latest Updates: పంజాబ్ కింగ్స్ ప్రధాన పేసర్, టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు (127) తీసిన రికార్డు ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌కు ఐపీఎల్ 2026 సీజన్ కలిసి రావడం లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో అత‌ని ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. నాలుగు ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ ఏకంగా 42 పరుగులు ఇచ్చాడు. 10.50 ఎకానమీ రేటుతో పంజాబ్ బౌలర్లలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి వచ్చిన అత‌డు ఏకంగా 11 బంతులు వేశాడు. ఇందులో ఐదు వైడ్‌లు, ఒక నో-బాల్ ఉండటం విశేషం. చివ‌రి బంతికి రివ్యూ తీసుకోవ‌డంతో అది క‌రెక్టు బాల్ గా తేలింది. లేక‌పోతే అర్ష‌దీప్ సింగ్ ఖాతాలో ఈ చెత్త రికార్డు మ‌రింత బ‌లంగా న‌మోదయ్యేది.

ఐపీఎల్లో అత్యంత సుదీర్ఘ ఓవర్
అర్ష్‌దీప్ వేసిన ఈ 11 బంతుల ఓవర్ ఐపీఎల్ చరిత్రలోనే జాయింట్-లాంగెస్ట్ ఓవర్‌గా నమోదైంది.  20వ ఓవర్గ వేసిన అర్షదీప్ సింగ్ చాలా సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. ఇందులో ఒక నోబ్, 5 వైడ్లు ఉండటం విశేషం. ఒకనొక దశలో ఓవర్ ఎప్పుడు పూర్తవుతుందంటూ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అసహనంగా  కనిపించాడు. ఇక 11వ బంతిని కూడా అంపైర్ వైడ్ గా ప్రకటించగా, రివ్యూలో అది కాలికి తాకినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ దాన్ని రివర్స్ చేశాడు. దీంతో 11 బంతుల తర్వాత ఓవర్ ముగిసింది. గతంలో మొహమ్మద్ సిరాజ్ (2023), తుషార్ దేశ్‌పాండే (2023), శార్దూల్ ఠాకూర్ (2025), సందీప్ శర్మ (2025), హార్దిక్ పాండ్యా (2025) మాత్రమే ఇలాంటి సుదీర్ఘ ఓవర్లు వేశారు. కీలక సమయంలో అర్ష్‌దీప్ ఇలా తడబడటం పంజాబ్ కింగ్స్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుంద‌ని ఆ జ‌ట్టు అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

చాహల్ మ్యాజిక్.. జీటీ తడబాటు
మరోవైపు మంగ‌ళ‌వారం న్యూ చండీగ‌ఢ్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో కీలక సమయంలో సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అనుభవంతో గుజరాత్ టైటాన్స్‌ను కట్టడి చేశాడు. మధ్య ఓవర్లలో కీలక వికెట్లు తీసి గుజరాత్ స్కోరును 162/6 వద్ద నిలవరించారు. చాహల్ 4 ఓవర్లలో 2/28 గణాంకాలతో ఆకట్టుకోగా, పేసర్ విజయ్‌కుమార్ వైశాక్ (3/34) స‌త్తా చాటాడు.. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. గిల్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ‌రుస విరామాల్లో బౌలింగ్ మార్పులతో వికెట్లు పడ్డాయి. ఒక‌ద‌శ‌లో 200 ప‌రుగులు సాధిస్తుంద‌నుకున్న గుజ‌రాత్.. బౌల‌ర్లు క‌ట్ట‌డి చేయ‌డంతో 162 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇక పిచ్ కు త‌గిన‌ట్లుగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతులు వేస్తూ గుజ‌రాత్ ను క‌ట్ట‌డి చేశారు.   

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Embed widget