IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్‌ను ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడచ్చు? - టీవీలో ఏ ఛానెల్లో వస్తుంది?
ఐపీఎల్ 2023 సీజన్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడవచ్చు?
IPL 2023 Online: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నాలుగు సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ హోమ్, ఎవే ఫార్మాట్‌కు తిరిగి వస్తోంది. అంటే తిరిగి అన్ని జట్లు తమ స్వస్థలంలో, ఇతర జట్ల మైదానాల్లో సగం సగం మ్యాచ్‌లు ఆడనున్నాయి. అంటే IPL 2023 మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ప్రత్యక్ష ప్రసారం, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా మీరు భారతదేశంలో ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం.
IPL 2023ని టీవీలో ఎలా చూడాలి?
IPL 2023లో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం గత సీజన్‌లో మాదిరిగానే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చేయబడుతుంది. ఈ టెలికాస్ట్ SD, HD రెండింటిలోనూ ఉంటుంది. ఈ మ్యాచ్‌లు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే కాకుండా అనేక ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటాయి.
IPL 2023ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి?
IPL 2023 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం జియో సినిమా యాప్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఈ మ్యాచ్‌లను 4కే రిజల్యూషన్‌లో చూడవచ్చని జియో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 12 భాషల్లో మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. ఈ మ్యాచ్‌లను యాప్ ద్వారా మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లలో చూడవచ్చు.
IPL 2023ని ల్యాప్‌టాప్, పీసీలో ఎలా చూడాలి?
ల్యాప్‌టాప్ లేదా పీసీని ఉపయోగించే వీక్షకులు జియో సినిమా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మ్యాచ్‌ను ఉచితంగా చూడవచ్చు.
మ్యాచ్ టైమింగ్ ఎలా ఉంటుంది?
ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30, సాయంత్రం 7.30 సమయాల్లో జరగనున్నాయి. అదే సమయంలో అన్ని ప్లేఆఫ్ మ్యాచ్‌లు రాత్రి 7.30 నుండి ప్రారంభం కానున్నాయి.
IPL 2023లో కొత్తగా ఏం ఉంటుంది?
IPL 2023లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం అమల్లోకి రానుంది. ఇప్పుడు ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను ప్రత్యామ్నాయంగా ఉంచుకోగలుగుతుంది. ఈ ఆటగాళ్లను మ్యాచ్ సమయంలో ఉపయోగించుకుంటారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏకంగా ఐదు సార్లు టైటిల్స్ గెలిచి అత్యంత విజయవంతమైన టీమ్ గా ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఆ జట్టు సారథి రోహిత్ శర్మ ఈసారి మాత్రం ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పదేండ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత అభిమానుల కల నెరవేర్చే క్రమంలో రోహిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఈ సీజన్ లో రోహిత్.. కెప్టెన్ గా దూరంగా ఉండనున్నాడని, భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ముంబైని నడిపించనున్నాడని సమాచారం.
ఐపీఎల్-16 సీజన్ లో రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్ లకే అందుబాటులో ఉంటాడట. హిట్‌మ్యాన్ గైర్హాజరీలో నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ముంబైని నడిపించనున్నట్టు ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి. మూడేండ్ల తర్వాత ఐపీఎల్ లో అందుబాటులోకి వస్తున్న ‘హోం అండ్ అవే’ ప్రకారం ఫ్రాంచైజీలు.. తమ హోమ్ గ్రౌండ్ తో పాటు ప్రత్యర్థి స్వంత వేదికలపైనా ఆడాల్సి ఉంటుంది. అయితే టీమ్ తో పాటు ప్రయాణించే రోహిత్.. మ్యాచ్ లకు మాత్రం డుమ్మా కొడతాడని సమాచారం.