IPL 2022: రాజస్థాన్‌కు షాకివ్వనున్న సంజు శాంసన్! వచ్చే సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు పయనం..!
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వచ్చే సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆడతాడని సమాచారం. తెరవెనుక చర్చలు, ఒప్పందాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్ ఆ ఫ్రాంచైజీతో తెగతెంపులు చేసుకున్నాడా? వచ్చే సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడనున్నాడా? అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో రాజస్థాన్‌ను అన్‌ఫాలో చేసి సీఎస్‌కేను ఫాలో అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది!
ఇండియన్ ప్రీమియర్ లీగులో విజయవంతమైన యువ ఆటగాళ్లలో సంజు శాంసన్ ఒకడు. వికెట్ కీపర్‌గానే కాకుండా టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా అతడికి తిరుగులేదు. మొన్నటి వరకు రాగానే బంతిని బలంగా బాది ఔటయ్యేవాడు. గత సీజన్లో కెప్టెన్‌గా ఎంపికయ్యాక తన తన ధోరణి మార్చుకున్నాడు. కుమార సంగక్కర కోచింగ్‌లో కాస్త రాటుదేలాడు. ఆరంభం నుంచే కాకుండా ఆచితూచి ఆడుతూ సమయోచితంగా సిక్సర్లు బాదడం అలవాటు చేసుకున్నాడు.
వచ్చే సీజన్ నుంచి సంజు శాంసన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఆడతాడని వార్తలు వస్తున్నాయి! సోషల్ మీడియా ద్వారా అతడు పరోక్షంగా సూచనలు చేశాడని తెలుస్తోంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు సంజు కెప్టెన్సీ చేశాడు. జట్టులో కీలక ఆటగాళ్లు లేకున్నా బాగానే ముందుకు నడిపించాడు. కొన్నేళ్లుగా అతడిని ఆ ఫ్రాంచైజీ ఆదరించింది. మొన్నటి వరకు ఆర్‌ఆర్‌ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే అతడు హఠాత్తుగా అన్‌ఫాలో చేశాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ను అనుసరించడం మొదలు పెట్టాడు.
వచ్చే సీజన్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. చెన్నైకి ధోనీయే కెప్టెన్‌గా ఉంటాడని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. ఈ ఏడాది తర్వాత అతడు ఆడేది కష్టమే! ఈ నేపథ్యంలో కోర్ గ్రూప్‌ను తయారు చేసుకోవాలని సీఎస్‌కే భావిస్తోంది. ధోనీ తర్వాత మంచి వికెట్ కీపర్ కోసం వెతికి సంజూతో మాట్లాడినట్టు తెలుస్తోంది. పైగా ధోనీ సారథ్యంలో అతడు నాయకత్వ మెలకువలు నేర్చుకొనేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ విషయంపై ఇప్పటి వరకు బహిరంగంగా ఎవరూ మాట్లాడలేదు. మరికొన్ని రోజులు ఆగితే స్పష్టత రావొచ్చు.
View this post on Instagram
Also Read: Net Run Rate: ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?
Also Read: T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!
Also Read: Ravi Shastri: కొత్త ఐపీఎల్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి.. ఏ జట్టుకంటే?
Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్