Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!
భారత హాకీ దిగ్గజం చరణ్‌జిత్ గురువారం మరణించారు. 1964లో టోక్యో ఒలంపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన జట్టుకు చరణ్‌జిత్ సింగే కెప్టెన్‌గా వ్యవహరించారు.
భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన చరణ్‌జిత్ సింగ్ గురువారం మరణించారు. ఆయన స్వగ్రామమైన హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో ఆయన మరణించారు. ప్రస్తుతం ఆయనకు 90 సంవత్సరాల వయసు కాగా.. మరో నెలలో 91 సంవత్సరాలు వచ్చేవి. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1964లో టోక్యో ఒలంపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన జట్టుకు చరణ్‌జిత్ సింగే కెప్టెన్‌గా వ్యవహరించారు. చరణ్‌జిత్ సింగ్‌కు ఐదు సంవత్సరాల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన పక్షవాతం బారిన పడ్డారు.
‘ఐదు సంవత్సరాల క్రితం గుండెపోటు వచ్చినప్పటి నుంచి నాన్న పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయన గతంలో చేతి కర్ర సాయంతో నడిచేవారు. అయితే గత కొంతకాలం నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈరోజు పొద్దున్న ఆయన మరణించారు.’ అని చరణ్‌జిత్ సింగ్ కుమారుడు వీపీ సింగ్ తెలిపారు.
1964లో స్వర్ణ పతకం గెలవడానికి ముందు.. 1960 ఒలంపిక్స్‌లో రజతం గెలిచిన జట్టులో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు. 1962 ఏసియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన జట్టులో కూడా ఆయన సభ్యుడే. ఆయన అంత్యక్రియలు గురువారమే జరుగుతాయని వీపీ సింగ్ తెలిపారు.
చరణ్‌జిత్ సింగ్ భార్య 12 సంవత్సరాల క్రితమే మృతి చెందారు. ఆయన పెద్ద కుమారుడు కెనడాలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ఆయన మరణించినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన కూతురు వివాహం చేసుకుని ఢిల్లీలో సెటిల్ అయ్యారు.
End of an era!
— Baijayant Jay Panda (@PandaJay) January 27, 2022
Saddened to learn of the passing of the veteran Olympian, Arjuna awardee & the Captain of the Gold medal winning Indian Hockey Team (1964 Olympics), Padma Shri #CharanjitSingh Ji. My thoughts and prayers are with the bereaved family.
Om Shanti 🙏🙏 pic.twitter.com/d66MR33iDQ
Two-time Olympic medallist and Padma Shri award winner #CharanjitSingh passed away on Thursday in Una district, Himachal Pradesh, due to age-related complications. He was 92. pic.twitter.com/rUC2HDjRmU
— IANS Tweets (@ians_india) January 27, 2022
देवभूमि हिमाचल के ऊना में जन्मे पूर्व भारतीय हाकी खिलाड़ी व कप्तान श्री चरणजीत सिंह जी का देवलोकगमन दुखदाई है। आपका देहावसान खेल जगत की एक बहुत बड़ी क्षति है।
— Anurag Thakur (@ianuragthakur) January 27, 2022
चरणजीत जी के नेतृत्व में ही भारतीय टीम ने 1964 में टोक्यो ओलंपिक में स्वर्ण पदक जीता था।खेल में उन्हें असाधारण प्रतिभा.. pic.twitter.com/oCowoRjSWl