By: ABP Desam | Updated at : 21 Sep 2021 07:09 PM (IST)
Edited By: Ramakrishna Paladi
మిథాలీ రాజ్
టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అద్భుతం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగుల మైలురాయిని అధిగమించింది. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచులో ఆమె అర్ధశతకం చేసి ఈ ఘనత అందుకుంది. ఇంగ్లాండ్ పర్యటనలోనే ఆమె అత్యధిక పరుగుల రారాణిగా అవతరించిన సంగతి తెలిసిందే.
Also Read: PBKS vs RR Match Preview: దంచుడే దంచుడు.. ఐపీఎల్ సిక్సర్ల మ్యాచుకు మీరు సిద్ధమేనా!
మిథాలీ ఒంటరి పోరాటం
ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా మంగళవారం తొలి వన్డే ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు షెపాలీ వర్మ (8), స్మృతి మంధాన (16) విఫలమవ్వడంతో భారమంతా మిథాలీ రాజ్ (63; 107 బంతుల్లో 3x4)పై పడింది. తన అనుభవాన్ని ఉపయోగించి అర్ధశతకం చేసింది. ఆసీస్ పేస్ బౌలింగ్ దాడిని ఎదుర్కొని స్కోరును 225కు తీసుకెళ్లింది.
సులభంగా ఛేదన
బౌలింగ్‌లో టీమ్‌ఇండియా విఫలమవ్వడంతో ఆసీస్ సునాయాసంగా లక్ష్యం ఛేదించింది. ఓపెనర్లు రేచల్ హెయిన్స్ (93*; 100 బంతుల్లో 7x4), అలీసా హేలీ (77; 77 బంతుల్లో 8x4, 2x6) తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కెప్టెన్ మెగ్ లానింగ్ (53*; 69 బంతుల్లో 7x4)తో కలిసి హెయిన్స్ 9 ఓవర్లు మిగిలుండగానే విజయం అందించింది.
మిథాలీపై అభినందనలు
అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు పూర్తి చేసిన మిథాలీకి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమె అర్ధశతకం సాధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మిథాలీ బయోపిక్‌లో నటిస్తున్న నటి తాప్సీ సైతం ఆమెను ప్రశంసించింది.
Mithali Raj brings up her 50! This morning she also completed 20000 career runs (and counting). Bravo. Playing on today after this blow to the head earlier! #AUSvIND pic.twitter.com/0vIcFHLDuc
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) September 21, 2021
MILESTONE ALERT🎖
— Female Cricket (@imfemalecricket) September 21, 2021
Indian legend Mithali Raj completes 20,000 career runs!#MithaliRaj #AUSvIND @M_Raj03 pic.twitter.com/qOlhq3rLf4
The run machine !!!! 👏🏾👏🏾👏🏾👏🏾 https://t.co/kF0t492uGy
— taapsee pannu (@taapsee) September 21, 2021
Asian Games 2023: చైనా పర్యటన రద్దు చేసుకున్న కేంద్రమంత్రి, అరుణాచల్ ఆటగాళ్లకు వీసా ఇవ్వకపోవడంతో నిర్ణయం
IND vs AUS 1st ODI: డేవిడ్ భాయ్ హాఫ్ సెంచరీ - చుక్కలు చూపిస్తున్న షమి
IND vs AUS 1st ODI: తొలి వన్డే టాస్ మనదే! రాహుల్ ఏం ఎంచుకున్నాడంటే!
Varanasi Stadium: మోడీ అడ్డాలో భారీ క్రికెట్ స్టేడియం - శివతత్వం ప్రతిబింబించేలా నిర్మాణం - తరలిరానున్న అతిరథులు
ODI World Cup 2023 : అమ్మో అహ్మదాబాద్! దాయాదుల పోరుకు దద్దరిల్లుతున్న రేట్లు - 415 శాతం పెరిగిన విమాన ఛార్జీలు
Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన
/body>