IND vs WI T20: సంజు శాంసన్ లక్కీ ఛాన్స్! కేఎల్ రాహుల్ ప్లేస్‌లో చోటు
IND vs WI T20: యువ క్రికెటర్ సంజు శాంసన్ మరో ఛాన్స్ కొట్టేశాడు! వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీసుకు ఎంపికయ్యాడు. కొవిడ్‌తో బాధపడుతున్న కేఎల్ రాహుల్ స్థానంలో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశాడు.

Squad Sanju Samson Replaces KL Rahul: యువ క్రికెటర్ సంజు శాంసన్ మరో ఛాన్స్ కొట్టేశాడు! వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీసుకు ఎంపికయ్యాడు. కొవిడ్‌తో బాధపడుతున్న కేఎల్ రాహుల్ స్థానంలో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశాడు. తొలుత సంజూను ఎంపిక చేయకపోవడంతో మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీసు శుక్రవారం నుంచి మొదలవుతోంది. ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియంలో తొలి పోరు జరుగుతుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ సిరీసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
కరీబియన్ టీ20 సిరీసుకు మొదట సంజు శాంసన్‌ను ఎంపిక చేయలేదు. దాంతో మీడియాలో విమర్శలు వచ్చాయి. నిలకడగా రాణిస్తున్నప్పటికీ అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను (KL Rahul) ఎంపిక చేసినప్పటికీ అతడు విండీస్‌కు రాలేదు. టీమ్‌ఇండియా బయల్దేరే ముందే అతడికి కొవిడ్ సోకింది. అంతకు ముందే అతడు గాయంతో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలకు దూరమవ్వడం గమనార్హం.
NEWS 🚨 - Sanju Samson replaces KL Rahul in T20I squad.
— BCCI (@BCCI) July 29, 2022
More details 👇 #WIvIND | #TeamIndia https://t.co/4LVD8rGTlE
వెస్టిండీస్‌తో టీ20 సిరీసులో సంజు శాంసన్‌కు (Sanju Samson) చోటివ్వకపోవడం న్యాయం కాదని టీమ్‌ఇండియా మాజీ పేసర్ దొడ్డ గణేశ్ గతంలో ట్వీట్ చేశారు. వాస్తవంగా పొట్టి క్రికెట్లో అలాంటి క్రికెటర్లే అవసరమని పేర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్ కోసం అతడిని పక్కన పెట్టడం ఎంత వరకు సబబని విమర్శించారు.
'నిజం చెప్పాలంటే టీ20 క్రికెట్‌కు సుంజు శాంసన్ వంటి క్రికెటర్లే అవసరం. శ్రేయస్ అయ్యర్ కోసం అతడిని పక్కనబెట్టడం క్రికెట్ లాజిక్‌కు విరుద్ధం' అని దొడ్డ గణేశ్ ట్వీట్ చేశారు. ఆయనతో పాటు చాలామంది సంజుకు అండగా నిలిచారు. ట్విటర్లో '#SanjuSamson' హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.
'నేనైతే సంజు శాంసన్‌కు మద్దతిస్తా. కనీసం విండీస్ టూర్‌కు జట్టులోకి తీసుకోకపోవడానికి అతడు చేసిన తప్పేంటి? ఒంటిపై టాటూలు లేకపోవడం, మంచి హెయిర్ స్టైల్ లేకపోవడం, కేరళ ఆటగాడు అవ్వడం, ఎలాంటి లాబీలో ఉండకపోవడమే కారణాలా?' అంటూ ఒకరు విమర్శించారు.
మరికొందరు చివరి మూడు టీ20ల్లో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ చేసిన స్కోర్లను పోలుస్తూ ట్వీట్ చేశారు. 'చివరి మూడు టీ20ల్లో టీమ్‌ఇండియా వికెట్ కీపర్ల స్కోర్లివి. రిషభ్ పంత్ 1, 26, 1; దినేశ్ కార్తీక్ 11, 12, 6; ఇషాన్ కిషన్ 26, 3, 8; సంజు శాంసన్ 39; 18; 77 మరి బాగా ఆడుతున్న కుర్రాడినే ఎందుకు తొలగించారో ఎవరైనా చెప్పగలరా?' అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

