అన్వేషించండి

IND vs WI, 3rd T20 Highlights: వెస్టిండీస్‌ను ఉతికేసిన టీమిండియా - మూడో టీ20లో ఘనవిజయం - 3-0తో వైట్‌వాష్!

IND vs WI, 3rd T20: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 17 పరుగులతో విజయం సాధించింది. సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.

IND Vs WI, T20 Result: వెస్డిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించంది. దీంతో సిరీస్‌ను కూడా 3-0తో వైట్ వాష్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (65: 31 బంతుల్లో, ఒక ఫోర్, ఏడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. నికోలస్ పూరన్ (61: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) రాణించినా... అది విజయానికి సరిపోలేదు.

పూరన్ దమ్ము సరిపోలేదు
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 2.4 ఓవర్లలో 26 పరుగులకే ఓపెనర్లు కైల్ మేయర్స్ (6: 5 బంతుల్లో), షాయ్ హోప్‌లను (8: 4 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుట్ చేసి దీపక్ చాహర్ వెస్టిండీస్‌ను కష్టాల్లో పడేశాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ (61: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్), రొవ్‌మన్ పావెల్ (25: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)  కలిసి వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 25 బంతుల్లోనే 47 పరుగులు జోడించారు.

ఆ తర్వాత వెస్టిండీస్ ఇన్నింగ్స్ మళ్లీ ఒడిదుడుకులకు లోనైంది. కేవలం 15 పరుగులు వ్యవధిలోనే రొవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్ (5: 7 బంతుల్లో), జేసన్ హోల్డర్ (2: 6 బంతుల్లో) అవుటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే రోస్టన్ చేజ్ కూడా అవుట్ కావడంతో విండీస్ 100 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ (29: 21 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), నికోలస్ పూరన్ వేగంగా ఆడారు. కేవలం 5.2 ఓవర్లలోనే వీరు ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు.అయితే విజయానికి 35 పరుగుల దూరంలో పూరన్ అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ కూడా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులకు పరిమితం అయింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా... రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

అదరగొట్టిన స్కై, వెంకటేష్ అయ్యర్
 అంతకు ముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్‌ (34: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (4: 8 బంతుల్లో, ఒక ఫోర్) భారత్‌కు శుభారంభం ఇవ్వలేకపోయారు. 10 పరుగుల వద్ద రుతురాజ్ అవుటయ్యాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (25: 16 బంతుల్లో, నాలుగు ఫోర్లు), ఇషాన్ కిషన్ రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుటయ్యారు.

తొమ్మిదో ఓవర్లో అయ్యర్‌ను వాల్ష్... పదో ఓవర్లో ఇషాన్ కిషన్‌ను రోస్టన్ చేజ్ అవుట్ చేశారు. రెండు వికెట్లు పడ్డాక బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (7: 15 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (65: 31 బంతుల్లో, ఒక ఫోర్, ఏడు సిక్సర్లు), వెంకటేష్ అయ్యర్ (35 నాటౌట్: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) భారత్‌ను ఆదుకున్నారు.

వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 37 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలోనే వీరు 86 పరుగులు సాధించడం విశేషం. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, హేడెన్ వాల్ష్, డొమినిక్ డ్రేక్‌లకు తలో వికెట్ దక్కింది. దీంతో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Embed widget