By: ABP Desam | Updated at : 22 May 2022 06:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
కేఎల్ రాహుల్
IND vs SA T20 Series KL Rahul to lead the side, know the squad and other details: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు బీసీసీఐ భారత జట్లను ప్రకటించింది. పొట్టి సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. శిఖర్ ధావన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. మరోవైపు సంజూ శాంసన్‌కూ చోటివ్వలేదు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య తిరిగి జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ సిరీసుకు రోహిత్ అందుబాటులోకి వస్తాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ నేతృత్వంలోనే ఆదివారం ముంబయిలో సెలక్షన్ కమిటీ సమావేశమైంది.
టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తారని తెలియడంతో శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంతా భావించారు. సెలక్టర్లు మాత్రం మరోలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ప్రకటించిన కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం అతడు లక్నో సూపర్ జెయింట్స్‌ను చక్కగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మ్యాచ్ ఫినిషర్‌గా మారిన దినేశ్ కార్తీక్‌కు చోటు దక్కింది. అతడు 200 స్ట్రైక్‌రేట్‌తో విధ్వంసాలు సృష్టిస్తున్నాడు. బౌలింగ్ ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య, ఆత్మవిశ్వాసంతో వికెట్లు తీస్తున్న కుల్‌దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చారు. హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌తో భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగం బాధ్యతలు తీసుకుంటాడు. వీరికి అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ తోడుగా ఉంటారు. విచిత్రంగా సంజు శాంసన్‌ను పక్కన పెట్టేశారు. యూజీ, కుల్‌దీప్, బిష్ణోయ్, అక్షర్‌తో స్పిన్ బలంగా ఉంది.
దక్షిణాఫ్రికా టీమ్‌ఇండియాతో ఐదు టీ20లు ఆడనుంది. జూన్ 9న దిల్లీ, 12న కటక్, 14న వైజాగ్, 17న రాజ్‌కోట్, 19న బెంగళూరులో మ్యాచులు ఆడుతుంది. జులై 1 నుంచి ఇంగ్లాండ్ పర్యటన మొదలవుతుంది. టీమ్‌ఇండియా అక్కడ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అంతకన్నా ముందు ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఉంటాయి.
టీ20 జట్టు: కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
టెస్టు జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చెతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
T20I Squad - KL Rahul (Capt), Ruturaj Gaikwad, Ishan Kishan, Deepak Hooda, Shreyas Iyer, Rishabh Pant(VC) (wk),Dinesh Karthik (wk), Hardik Pandya, Venkatesh Iyer, Y Chahal, Kuldeep Yadav, Axar Patel, R Bishnoi, Bhuvneshwar, Harshal Patel, Avesh Khan, Arshdeep Singh, Umran Malik
— BCCI (@BCCI) May 22, 2022
TEST Squad - Rohit Sharma (Capt), KL Rahul (VC), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Hanuma Vihari, Cheteshwar Pujara, Rishabh Pant (wk), KS Bharat (wk), R Jadeja, R Ashwin, Shardul Thakur, Mohd Shami, Jasprit Bumrah, Mohd Siraj, Umesh Yadav, Prasidh Krishna #ENGvIND
— BCCI (@BCCI) May 22, 2022
IND VS AUS: రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా పైచేయి - అర్థ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్!
WTC Final 2023: టీమ్‌ఇండియాతో ఆసీస్ టఫ్ ఫైట్ - లంచ్ టైమ్‌కు కంగారూలు 73/2
WTC Final 2023: ఫైనల్ టాస్ టీమ్‌ఇండియాదే! ఆసీస్ తొలి బ్యాటింగ్
WTC Final 2023: కింగ్ కోహ్లీ ఏంటీ! వార్నర్‌ను ఇంతలా పొగిడేస్తున్నాడు..!
WTC Final: ప్రతిసారీ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ అవసరం లేదు - సచిన్ నోట ఇలాంటి మాటా!!
Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!