By: ABP Desam | Updated at : 18 Dec 2021 06:48 PM (IST)
Edited By: Ramakrishna Paladi
కేఎల్ రాహుల్
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరో మెట్టు ఎగబాకాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీసుకు అతడు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయపడ్డ రోహిత్ శర్మ స్థానంలో అతడిని విరాట్‌కోహ్లీకి డిప్యూటీగా నియమిస్తున్నామని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమ్‌ఇండియా ముంబయిలో సాధన చేసింది. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ పిక్క కండరాలు పట్టేశాయి. దాంతో అతడిని మూడు టెస్టుల సిరీసు నుంచి బీసీసీఐ తప్పించింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించింది. అతడి స్థానంలో ప్రియాంక్ పంచాల్‌ను ఎంపిక చేసింది.
NEWS - KL Rahul named vice-captain of Test team for South Africa series.
KL Rahul replaces Rohit Sharma as vice-captain, who was ruled out of the Test series owing to a hamstring injury.
More details here - https://t.co/7dHbFf74hG #SAvIND | @klrahul11 pic.twitter.com/6pQPTns9C7 — BCCI (@BCCI) December 18, 2021
ఈ టెస్టు సిరీసుకు మొదట రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. అతడు గాయంతో వెనుదిరగడంతో కేఎల్ రాహుల్‌ను డిప్యూటీగా చేస్తారని ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే అతడినే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తున్నట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 'న్యూస్ - దక్షిణాఫ్రికా సిరీసులో కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తున్నాం. పిక్క కండరాల గాయంతో దూరమైన రోహిత్ స్థానాన్ని రాహుల్ భర్తీ చేస్తాడు' అని బోర్డు ట్వీట్ చేసింది.
వాస్తవంగా అజింక్య రహానె జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండేవాడు. ఫామ్ లేమి, నిలకడ లేమితో అతడు ఇబ్బందులు పడుతున్నాడు. అతడిపై భారాన్ని తొలగించేందుకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్‌ను టెస్టు వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. మూడు మ్యాచుల టెస్టు సిరీసు మరికొన్ని రోజుల్లో మొదలవుతోంది. సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న తొలి టెస్టు, జనవరి 7 నుంచి జోహనెస్ బర్గ్‌లో రెండో టెస్టు, జనవరి 11 నుంచి న్యూలాండ్స్‌లో మూడో టెస్టు జరుగుతాయి. ఆ తర్వాత వన్డే సిరీసు మొదలవుతుంది. ప్రస్తుతం గాయపడ్డ రోహిత్ ఆ సిరీసుకు అందుబాటులో ఉంటాడు.
Also Read: Year Ender 2021: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్ రోహిత్' మర్చిపోలేని 2021
Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021
Also Read: Kidambi Srikanth: వరల్డ్ చాంపియన్ షిప్స్‌లో పతకం ఖాయం.. సెమీస్‌కు చేరిన తెలుగు తేజం!
Also Read: Hockey Men's Asian Champions Trophy: శెభాష్ భారత్..! పాక్‌ను ఓడించి సెమీస్ చేరిన హాకీ ఇండియా
Also Read: India U19 team: కుర్రాళ్లకు రోహిత్ పాఠాలు..! జోరు మీదున్న కొత్త కెప్టెన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
IPL 2022, Qualifier 1 Preview: ఫైనల్స్ మొదటి బెర్త్ ఎవరిది? - టైటాన్స్, రాయల్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి?
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!
SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి
Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల