Ind vs SA, 1st Innings Highlights: చెలరేగిన భారత బౌలర్లు... సౌతాఫ్రికా 199 పరుగులకే ఆలౌట్... 146 పరుగుల ఆధిక్యంలో భారత్
IND vs SA, 1st Test, SuperSport Park Cricket Stadium: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. సౌతాఫ్రికాను 199 పరుగులకే ఆలౌట్ చేశారు.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్ స్పోర్ట్ పార్క్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆట ముగిసింది. మూడో రోజు భారత బౌలర్లు చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్ లో ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. సౌతాఫ్రికాను 199 పరుగులకే కట్టడిచేశారు. దీంతో భారత్ కు మొదటి ఇన్సింగ్ లో 130 పరుగుల ఆధిక్యం దక్కింది. అంతకు ముందు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలో గట్టిదెబ్బ తగిలింది. 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. భారత బౌలర్ల దాటికి వరుసగా వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 199 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి 200 వికెట్ల కబ్ల్ లో చేరాడు. జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లో టెంబా బావుమా 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకు ముందు లుంగీ ఎంగిడి ఆరు వికెట్లు పడగొట్టాడు. మొదటి టెస్టులో 3వ రోజు ఆట ఆరంభించిన భారత్ బ్యాట్స్ మెన్ సౌతాఫ్రికా బౌలర్ల దాటికి చేతులెత్తేశారు. మంగళవారం కేవలం 55 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 327 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్సింగ్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. భారత్ మొత్తం ఆధిక్యం 146కు చేరింది. కేఎల్ రాహుల్ ఐదు పరుగులు, శార్ధూల్ ఠాకూర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. మయాంక్ అగర్వాల్(4) చేసి అవుట్ అయ్యాడు.
Also Read: 278కి రాహుల్ ఔట్.. 327 టీమ్‌ఇండియా ఆలౌట్
రాణించిన రాహుల్, మయాంక్ అగర్వాల్
సెంచూరియన్‌లో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 105.3 ఓవర్లకు 327 పరుగులకు కోహ్లీసేన ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (123; 260 బంతుల్లో 16x4, 1x6) శతక మోత మోగించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60; 123 బంతుల్లో 9x4) అర్ధశతకంతో అదరగొట్టాడు. సీనియర్ ఆటగాడు అజింక్య రహానె (48; 102 బంతుల్లో 9x4) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. రాహుల్ ఉన్నంత వరకు అద్భుతంగా ఆడిన భారత్ అతడు ఔటవ్వగానే ఎంతోసేపు నిలబడలేదు. కేవలం 49 పరుగుల వ్యవధిలో ఆలౌటైంది. లుంగి ఎంగిడి 6, కాగిసో రబాడా 3 వికెట్లు తీశారు. జన్‌సెన్‌కు ఒక వికెట్ దక్కింది.
Also Read: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!
55 పరుగులకే 7 వికెట్లు
రెండో రోజు వర్షంతో ఆట రద్దైంది. మూడో రోజు, మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 272/3తో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆరంభించింది. చల్లని వాతావరణం, పిచ్‌లో మార్పులు రావడంతో సఫారీ బౌలర్లు దానిని ఆసరాగా చేసుకున్నారు. కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులేసి భారత్‌ను దెబ్బకొట్టారు. 122తో బ్యాటింగ్‌కు వచ్చిన ఓపెనర్ కేఎల్ రాహుల్ మరో పరుగుకే వెనుదిరిగాడు. అర్ధశతకానికి 2 పరుగుల దూరంలో అజింక్య రహానె ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 291. ఆపై సఫారీ బౌలర్లు రెచ్చిపోవడంతో రిషభ్ పంత్ (8), అశ్విన్ (4), శార్దూల్ ఠాకూర్ (4), మహ్మద్ షమి (8), జస్ప్రీత్ బుమ్రా (14) వెంటవెంటనే పెవిలియన్ చేరారు.
Also Read: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్!