England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్!
యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ ఒక చెత్త రికార్డును సొంతం చేసుకుంది.
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు టెస్టుల్లో ఈ సంవత్సరం అంతగా కలిసిరాలేదు. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఇంగ్లండ్ ఈ సంవత్సరం టెస్టు ఓటములను చవిచూసింది. ఈ ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యమే. ఆదివారం ఆస్ట్రేలియాతో ప్రారంభమైన యాషెస్ సిరీస్ బాక్సింగ్ డే టెస్టులో కూడా ఇంగ్లండ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ హసీబ్ హమీద్ డకౌట్ అయ్యాడు. దీంతో 2021లో టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ 50 డకౌట్ల మార్కును దాటారు. రెండో స్థానంలో ఉన్న టీమిండియాకు, ఇంగ్లండ్‌కు మధ్య చాలా తేడా ఉంది. ఈ జాబితాలో 34 డకౌట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. జింబాబ్వే, బంగ్లాదేశ్, వెస్టిండీస్ తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఒక సంవత్సరంలో టెస్టుల్లో అత్యధిక డకౌట్ల జాబితాలో ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రస్తుతం అనడానికి కారణం ఏంటంటే.. మొదటి స్థానంలో కూడా ఉన్నది కూడా ఇంగ్లండే. కాకపోతే అది 1998లో జరిగింది. 1998లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఏకంగా 54 సార్లు డకౌట్ అయ్యారు. ఈ సంవత్సరం ఇంగ్లండ్ మరో టెస్టు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు డకౌట్లు నమోదైతే మాత్రం అత్యంత చెత్త రికార్డును ఇంగ్లండ్ సవరిస్తుంది.
ఈ సంవత్సరం ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ చాలా సార్లు కుప్పకూలింది. మంచి ప్రారంభాలను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఏకంగా 50 డకౌట్లు ఉన్నాయంటే.. వారి బ్యాటింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌పై బోలెడన్ని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. టెస్టు మ్యాచ్‌ల్లో వారి ఆటతీరు అస్సలు బాలేదని, నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్లు అవ్వకుండా.. జాగ్రత్త పడతారో.. మళ్లీ బోల్తా పడి 54 డకౌట్ల రికార్డు బద్దలు కొడతారో చూడాలి.
Most ducks by team in 2021 Tests
— Broken Cricket (@BrokenCricket) December 26, 2021
50 England
34 India
23 Bangladesh
23 West Indies
23 Zimbabwe
Teams with a half century of Test ducks in a calendar year:
— Kausthub Gudipati (@kaustats) December 26, 2021
England in 1998 (54 ducks)
England in 2021 (50* ducks)#Ashes #AUSvENG
Also Read: 83 Film Update: ప్రపంచకప్ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్ డెవిల్స్..! ఎందుకో తెలుసా?
Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్!
Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?
Also Read: IND vs SA: ద్రవిడ్ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!
Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!
Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్, కోహ్లీ ప్రశంసలు