X

IND vs NZ: అక్షర్‌ అస్త్ర ప్రయోగానికి కివీస్‌ విలవిల..! 4 టెస్టుల్లోనే 5సార్లు 5 వికెట్ల ఘనత

యువ క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌ స్పిన్‌కు కివీస్ బెంబేలెత్తింది. అద్భుతమైన ఆరంభం లభించినా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో త్వరగానే ఔటైంది. అక్షర్‌ ఐదోసారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు.

FOLLOW US: 

టీమ్‌ఇండియా యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అద్భుతం చేశాడు. టెస్టు కెరీర్లో ఐదోసారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇందుకోసం అతడు కేవలం నాలుగు టెస్టులే ఆడటం గమనార్హం.

కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో మూడో రోజు అక్షర్‌ విజృంభించాడు. తన ఎడమచేతి వాటం స్పిన్‌తో కివీస్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆ జట్టు స్కోరును 296కు పరిమితం చేశాడు. జట్టు స్కోరు 214 నుంచి సగటున పది పరుగులకు ఒక వికెట్‌ చొప్పున అందించాడు.

వికెట్లు తీసిన విధానం

  • 94.3వ బంతికి రాస్‌ టేలర్‌ను ఔట్‌ చేశాడు. కీపర్‌ భరత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అప్పటికి స్కోరు 214/3
  • 96.5వ బంతికి హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్‌ పంపించాడు. వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అప్పటికి స్కోరు 218/4
  • 102.1వ బంతికి శతకానికి చేరువైన టామ్ లేథమ్‌ను ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 227/5
  • 123.4వ బంతికి టామ్‌ బ్లండెల్‌ను బౌల్డ్‌ చేశాడు. అప్పటికి స్కోరు 258/7
  • 127.4వ బంతికి టిమ్‌ సౌథీని బౌల్డ్‌ చేయడంతో అక్షర్‌కు ఐదో వికెట్‌ దక్కింది. అప్పటికి స్కోరు 270/8

పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తే అక్షర్‌ను ఆపడం చాలా కష్టం! వికెట్‌లోని పగుళ్లను ఉపయోగించుకొని నేరుగా వికెట్లకు బంతులు సంధిస్తాడు. బ్యాటర్ తప్పక ఆడే పరిస్థితి కల్పిస్తాడు. దాంతో బ్యాటు అంచుకు తగిలి ఔటవ్వడమో లేదంటే వికెట్ల ముందో దొరికిపోతుంటాడు. ఇంగ్లాండ్‌ సిరీసులోనూ అతడిలాగే చేశాడు. తన సొంత మైదానం మోతెరాలో మూడు మ్యాచుల్లోనే నాలుగుసార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు.

Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!

Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?

Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!

Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌

Also Read: Ind vs NZ, 1st Test Match Highlights: ఇదేంది సామీ..! ఒక్క వికెట్టైనా తీయలేదు.. కివీస్‌ 129/0

Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Team India Axar Patel Ind Vs NZ Kanpur Test fifer four Tests

సంబంధిత కథనాలు

IPL Lucknow Team: ఆ జట్టు పాత పేరునే కొత్త జట్టుకు.. లక్నో టీం పేరు ఫిక్స్!

IPL Lucknow Team: ఆ జట్టు పాత పేరునే కొత్త జట్టుకు.. లక్నో టీం పేరు ఫిక్స్!

ICC Awards: 2021లో ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు ఇతనే.. ఎన్ని పరుగులు చేశాడంటే?

ICC Awards: 2021లో ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు ఇతనే.. ఎన్ని పరుగులు చేశాడంటే?

Virat Kohli: కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు... ఇదేం పని అంటూ ఆగ్రహం...!

Virat Kohli: కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు... ఇదేం పని అంటూ ఆగ్రహం...!

Rahul Dravid Comments: క్లీన్‌స్వీప్ ఓటమి మాకు కనువిప్పు.. టీమిండియా దారుణ వైఫల్యంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే..!

Rahul Dravid Comments: క్లీన్‌స్వీప్ ఓటమి మాకు కనువిప్పు.. టీమిండియా దారుణ వైఫల్యంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే..!

Ind VS SA: పరాజయం పరిపూర్ణం... సిరీస్ వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. చాహర్ పోరాటం సరిపోలేదు!

Ind VS SA: పరాజయం పరిపూర్ణం... సిరీస్ వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. చాహర్ పోరాటం సరిపోలేదు!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP Employees Strike Notice : ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

AP Employees Strike Notice :   ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!