Ind vs NZ, 1st Test Match Highlights: అయ్యారే.. అయ్యర్! గట్టెక్కించిన శ్రేయస్.. తొలిరోజు భారత్ 258/4
ముగ్గురు ఆటగాళ్లు అర్ధశతకాలు చేయడంతో తొలిరోజు కివీస్‌పై భారత్ పైచేయి సాధించింది. ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
యువ క్రికెటర్ల దన్నుతో టీమ్‌ఇండియా జోరందుకుంది! ముగ్గురు ఆటగాళ్లు అర్ధశతకాలు చేయడంతో తొలిరోజు కివీస్‌పై పైచేయి సాధించింది. ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (52; 93 బంతుల్లో 5x4, 1x6) అదరగొట్టగా ఆపై అరంగేట్రం వీరుడు శ్రేయస్ అయ్యర్ (75 బ్యాటింగ్; 136 బంతుల్లో 7x4, 2x6) దుమ్మురేపాడు. అతడికి రవీంద్ర జడేజా (50 బ్యాటింగ్; 100 బంతుల్లో 6x4) అండగా నిలిచాడు.
STUMPS on Day 1 of the 1st Test.
— BCCI (@BCCI) November 25, 2021
An unbeaten 113-run partnership between @ShreyasIyer15 & @imjadeja propel #TeamIndia to a score of 258/4 on Day 1.
Scorecard - https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/7dNdUM0HkM
'శుభ్' ఆరంభం
కాన్పూర్ వేదికగా జరుగుతున్న పోరులో టీమ్‌ఇండియా టాస్ గెలిచింది. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (13; 28 బంతుల్లో 2x4) ఫర్వాలేదనిపించాడు. జట్టు స్కోరు 21 వద్ద అతడిని కైల్ జేమిసన్ పెవిలియన్ పంపించాడు. అయితే చెతేశ్వర్ పుజారా (26; 88 బంతుల్లో 2x4)తో కలిసి శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. చూడచక్కని బౌండరీలు, ఒక సిక్సర్‌తో అదరగొట్టాడు. తొలి వికెట్‌కు 21, రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో లంచ్ విరామానికి టీమ్‌ఇండియా 82/1తో నిలిచింది.
శ్రేయస్కర అరగేంట్రం
లంచ్ తర్వాత భారత్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. రాగానే శుభ్‌మన్ ఔటయ్యాడు. జట్టు స్కోరు 106 వద్ద పుజారాను సౌథీ బోల్తా కొట్టించాడు. మరికాసేపటికే నిలకడగా ఆడుతున్న కెప్టెన్ అజింక్య రహానె (35; 63 బంతుల్లో 6x4)ను జేమీసన్ బౌల్డ్ చేశాడు. 145/4తో కష్టాల్లో పడ్డ టీమ్‌ఇండియాను అరంగేట్రం వీరుడు శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి గట్టెక్కించాడు. వీరిద్దరూ కివీస్ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్నారు. టీ విరామానికి 154/4తో ఉన్న జట్టును మెరుగైన స్కోరు వద్దకు నడిపించారు. దొరికిన బంతుల్ని చక్కగా బౌండరీకి పంపించారు. శ్రేయస్ 94, జడ్డూ 99 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 113 (208 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించి జట్టును మెరుగైన స్థితిలో ఉంచారు. జేమీసన్ 3, సౌథీ 1 వికెట్ తీశారు.
FIFTY for @imjadeja 👌
— BCCI (@BCCI) November 25, 2021
This is his 17th 50 in Test cricket.
Live - https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/pbnOyGerAz
Also Read: IPL 2022 Auction: శ్రేయస్‌కు షాకిచ్చిన దిల్లీ..! తామిద్దరినీ రీటెయిన్ చేసుకోవడం లేదన్న అశ్విన్
Also Read: Gambhir on Ajinkya Rahane: రహానె లక్కీ అనే చెప్పాలి మరి! గంభీర్ ఎందుకిలా అన్నాడో తెలుసా?
Also Read: KL Rahul Ruled Out: టీమ్‌ఇండియాకు షాక్..! కేఎల్ రాహుల్‌కు గాయం.. కివీస్‌తో టెస్టు సిరీసుకు దూరం!
Also Read: Ind vs Nz, 1st Test: అరెరె..! కోహ్లీని పలకరించిన ఈ కొత్త గెస్ట్ ఎవరో తెలుసా!!
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 మొదలయ్యేది ఆరోజే? మొదటి మ్యాచ్ ఎక్కడ.. ఎవరికి?