Ind Vs NZ, 1st Test: మూడోరోజు ముగిసేసరికి భారత్ 14/1.. అశ్విన్, అక్షర్ రికార్డులు!
భారత్, న్యూజిలాండ్ మొదటి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ముగిసేసరికి భారత్ రెండో ఇన్సింగ్స్‌లో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. అంతకుముందు న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ అయింది.
129-0 ఓవర్‌నైట్ స్కోరుతో ఈరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కాసేపు సాఫీగానే సాగింది. మొదటి వికెట్‌కు 151 పరుగులు జోడించిన అనంతరం ఓపెనర్ విల్ యంగ్‌ను (89: 214 బంతుల్లో, 15 ఫోర్లు) అవుట్ చేసి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ భారత స్పిన్నర్లను తట్టుకుని నిలబడలేకపోయారు.
మరో ఓపెనర్ టామ్ లాథమ్ (95: 282 బంతుల్లో, 10 ఫోర్లు) సెంచరీ ముంగిట అవుటయ్యారు. ఓపెనర్లిద్దరి తర్వాత పేస్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్‌దే (23: 75 బంతుల్లో, ఒక ఫోర్) అత్యధిక స్కోరు. వన్ డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ (18: 64 బంతుల్లో, రెండు ఫోర్లు), తర్వాత వచ్చిన రాస్ టేలర్ (11: 28 బంతుల్లో, ఒక ఫోర్) కూడా త్వరగా అవుటయ్యారు. కేన్ విలియమ్సన్ వికెట్ ఉమేష్ యాదవ్‌కు దక్కగా, రాస్ టేలర్‌ను అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్రను (13: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు.
49 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్(1: 3 బంతుల్లో) రెండో ఓవర్‌లోనే అవుటయ్యాడు. కైల్ జేమీసన్.. గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన పుజారా (9 బ్యాటింగ్: 14 బంతుల్లో, రెండు ఫోర్లు), మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(4 బ్యాటింగ్: 13 బంతుల్లో) కలసి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
పిచ్ స్పిన్‌కు సహకరించడంతో అశ్విన్, జడేజా, అక్షర్ చెలరేగిపోయారు. అక్షర్ పటేల్ ఐదు వికెట్ల ఫీట్ అందుకోగా.. అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. జడేజా, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయస్ అయ్యర్ (105; 171 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీ సాధించడంతో పాటు రవీంద్ర జడేజా (50; 112 బంతుల్లో 6x4) అర్థ సెంచరీ సాధించాడు.
ఈరోజు ఆటలో కొన్ని బౌలింగ్ రికార్డులు బద్దలయ్యాయి. అక్షర్ ఐదు వికెట్లు తీయడం గత నాలుగు టెస్టుల్లో ఇది ఐదోసారి. నాలుగు టెస్టుల్లో ఐదు వికెట్ల ఫీట్‌ను ఎక్కువసార్లు సాధించిన బౌలర్లలో అక్షర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ చార్లీ టర్నర్ ఆరు సార్లు ఈ ఫీట్ సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 416 టెస్టు వికెట్లతో అశ్విన్.. హర్భజన్(417) రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు.
అత్యంత తక్కువ బంతుల్లో 50 వికెట్లు సాధించిన బౌలర్లలో కైల్ జేమీసన్ మూడో స్థానంలో నిలిచాడు. 1865 బంతుల్లో కైల్ ఈ రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్ వెర్నాన్ ఫిలాండర్(1240 బంతులు), ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ(1844 బంతులు) ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!
Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?
Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!
Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్ ప్లేయర్
Also Read: Ind vs NZ, 1st Test Match Highlights: ఇదేంది సామీ..! ఒక్క వికెట్టైనా తీయలేదు.. కివీస్ 129/0
Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి