IND vs ENG, 5th Test: భారత్‌తో చివరి టెస్టు కోసం జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్... జోస్ బట్లర్, జాక్ లీచ్ రీ ఎంట్రీ
India vs England: భారత్‌తో తుది పోరు కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
England Squad for 5th Test: భారత్‌తో తుది పోరు కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం ఈ టెస్టు ప్రారంభంకానుంది. ఇప్పటికే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ వెనుకంజలో ఉంది. చివరి టెస్టు ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ 2-2తో డ్రాగా ముగుస్తుంది. ఒక వేళ ఇంగ్లాండ్ ఓడిపోతే భారత్ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
We've named a 16-player squad for the fifth LV= Insurance Test match against India 🏏
— England Cricket (@englandcricket) September 7, 2021
🏴 #ENGvIND 🇮🇳
తప్పక గెలవాల్సిన టెస్టు కోసం ఇంగ్లాండ్ జోస్ బట్లర్, ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్‌ను జట్టులోకి తీసుకువచ్చింది. బట్లర్ దంపతులు ఇటీవల ఆడబిడ్డకి జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే అతడు నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. నాలుగో టెస్టులో భారత్ 157 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ని చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
నాలుగో టెస్టులో బట్లర్ స్థానంలో వికెట్ కీపర్ బాధ్యతలని అందుకున్న బెయిర్ స్టో అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో అతడు చివరి టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఊహించని మార్పులతోనే ఇంగ్లాండ్ చివరి టెస్టు కోసం బరిలోకి దిగబోతుందని అభిమానుల అంచనా.
ఇంగ్లాండ్ టీమ్: జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, రోరీ బర్న్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), శామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రైగ్ ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్స్, క్రిస్‌వోక్స్, మార్క్‌వుడ్.
ALSO READ:జాతీయ జెండాను అగౌరపరచొద్దు... ఫొటోలు వైరల్... అభిమానులను కోరిన సునీల్ గావస్కర్
ALSO READ:డ్రస్సింగ్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం... వెల్లువెత్తిన ప్రశంసలు
ALSO READ: భారత్ ఫస్ట్... పాకిస్థాన్ సెకండ్... ICC World Test Championship పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానం