ICC World Test Championship: భారత్ ఫస్ట్... పాకిస్థాన్ సెకండ్... ICC World Test Championship పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానం
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తిరిగి అగ్రస్థానానికి ఎగబాకింది.
ఆతిథ్య ఇంగ్లాండ్ పై ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తిరిగి అగ్రస్థానానికి ఎగబాకింది. ఓవల్ వేదికగా సోమవారం ముగిసిన ఈ టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అదరగొట్టిన భారత్ 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యాన్ని అందుకుంది. ఇక చివరి టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.
ICC World Test Championship (2021-23)లో భాగంగా ఇప్పటి వరకూ 4 టెస్టులు ఆడిన భారత్ రెండింటిలో గెలుపొంది.. ఒక మ్యాచ్‌లో ఓడి.. ఒకదాన్ని డ్రాగా ముగించింది. దీంతో 54.17 శాతం పర్సంటైల్‌తో 26 పాయింట్లతో భారత్ నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్ (12 పాయింట్లు), వెస్టిండీస్ (12), ఇంగ్లాండ్ (14) టాప్ - 4లో నిలిచాయి. నాలుగో టెస్టులో 157 పరుగులతో అద్భుత విజయంతో 50 ఏళ్ల తర్వాత ఓవల్ మైదానంలో విజయాన్ని అందుకుంది. 1971లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో విజయాన్ని అందుకున్న టీమిండియా మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కోహ్లీ నాయకత్వంలో ఓవల్ మైదానంలో విజయాన్ని సాధించింది.
Also Read: Video: డ్రస్సింగ్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం... వెల్లువెత్తిన ప్రశంసలు
భారత్ తరహాలోనే నాలుగు టెస్టులాడిన ఇంగ్లాండ్... విండీస్, పాక్‌ల కంటే ఎక్కవగా ఉన్నప్పటికీ.. టీమిండియాతో సిరీస్‌లో రెండు ఓటములు ఉండడంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఒక మ్యాచ్‌లో గెలిచి.. రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. మరొకదాన్ని డ్రాగా ముగించింది. ఇంగ్లాండ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నప్పటికీ.. 12 పాయింట్లతో ఉన్న పాక్ రెండో స్థానంలో నిలిచింది. దీనికి కారణం? ఇంగ్లాండ్ గెలుపు శాతం 29.17తో పోలిస్తే పాకిస్థాన్ గెలుపు శాతం(50.0%) మెరుగ్గా ఉండటమే.
Also Read: InPics: UAE చేరుకున్న ఏబీ డివిలియర్స్... ఫొటోలు షేర్ చేసిన ABD... సెప్టెంబర్ 19 నుంచి IPL
సిరీస్‌లోని ప్రతి టెస్టు మ్యాచ్‌కి 12 పాయింట్లని ఐసీసీ కేటాయిస్తోంది. మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి 12 పాయింట్లు వస్తాయి. మ్యాచ్ టై అయితే ఇరు జట్లు చెరో ఆరు పాయింట్లు పంచుకోనున్నాయి. ఇక మ్యాచ్ డ్రా అయితే రెండు జట్లకి నాలుగేసి పాయింట్లు దక్కుతాయి.