News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IND vs ENG 1st ODI Toss Update: కోహ్లీకి దక్కని చోటు! తొలి బ్యాటింగ్‌ ఎవరిదంటే?

IND vs ENG 1st ODI: భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టీ20 టాస్‌ వేశారు. ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టీమ్‌ఇండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

FOLLOW US: 
Share:

IND vs ENG 1st ODI Toss Update:  భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టీ20 టాస్‌ వేశారు. ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టీమ్‌ఇండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. పరిస్థితులు, పిచ్‌ను బట్టి మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నామని రోహిత్ శర్మ అన్నాడు. ఐదుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌడర్లు, నలుగురు సీమర్లను తీసుకున్నామని పేర్కొన్నాడు. మూడో స్థానంలో శ్రేయస్‌ బ్యాటింగ్‌కు వస్తాడని తెలిపాడు. కోహ్లీ ఆడటం లేదని, అతడికి గజ్జల్లో గాయమైందని వెల్లడించాడు. అర్షదీప్‌ సింగ్‌ కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించాడు.

IND vs ENG 1st ODI Playing XI

ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, క్రెయిగ్‌ ఓవర్టన్‌, డేవిడ్‌ విలే, బ్రేడన్‌ కేర్స్‌, రీస్‌ టాప్లే

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌

కోహ్లీకి రెస్ట్

ఐదో టెస్టు ఓటమికి టీమ్‌ఇండియా ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. టీ20 సిరీసులో దుమ్మురేపింది. ఇప్పుడు వన్డేలపై దృష్టి సారించింది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు (Rohit Sharma) మంచి రికార్డుంది. వరుస సెంచరీలు కొట్టిన అనుభవం ఉంది. విరాట్‌ (Virat kohli) పరిస్థితి అర్థమవ్వడం లేదు. ఆఖరి టీ20లో సెంచరీ దంచికొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌పై (Suryakumar Yadav) అందరి చూపు నెలకొంది.

పొట్టి సిరీసులో ఓపెనర్‌గా రాణించని రిషభ్ పంత్‌ ఈ సారి మిడిలార్డర్‌కు వెళ్లనున్నాడు. హిట్‌మ్యాన్‌తో కలిసి శిఖర్ ఓపెనింగ్‌ చేయనున్నాడు. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఎలా ఆడతాడోననన్న ఆసక్తి నెలకొంది. ఏడాది తర్వాత అతడు తొలి వన్డే ఆడుతున్నాడు. బౌలింగ్‌ ఎన్ని ఓవర్లు వేస్తాడో చూడాలి. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమికి చోటు ఖాయం. సిరాజ్‌, ప్రసిద్ధ్‌లో ఎవరో ఒకరు వస్తారు. ఇద్దరు ఆల్‌రౌండర్లకు చోటు దక్కనుంది.

ఆ ముగ్గురితో ప్రమాదం

పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్‌ ఎప్పటికీ ప్రమాదకరమే! టీ20 సిరీస్‌ ఓడినంత మాత్రాన తక్కువ అంచనా వేయొద్దు. ఈ మధ్యే నెదర్లాండ్స్‌పై ప్రపంచ రికార్డు స్కోరు కొట్టేశారు. కొత్త కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌పై (Jos Buttler) ఒత్తిడి నెలకొంది. ఏ క్షణమైనా అతడు దంచకొట్టగలడు. జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow), జో రూట్‌, బెన్‌స్టోక్స్‌ తిరిగొచ్చేశారు. మోర్గాన్‌ రిటైర్మెంట్‌తో లివింగ్‌స్టోన్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఓపెనింగ్‌లో జేసన్‌ రాయ్‌ ప్రమాదకరంగా ఉన్నాడు. డేవిడ్‌ విలే, టాప్లే సామ్‌కరన్‌ రూపంలో ముగ్గురు లెఫ్ట్‌ హ్యాండ్‌ పేసర్లు ఉన్నారు. తోడుగా బ్రేడన్‌ కేర్స్‌ ఉన్నాడు. ఆంగ్లేయుల్లో ఏ ఇద్దరు నిలబడ్డా పరుగుల వరద పారడం ఖాయం.

అందరికీ సహకారం!

ఓవల్‌ పిచ్‌పై పచ్చిక కనిపిస్తోంది. అయితే ఎక్కువ వేడి, ఉక్కపోత వల్ల బంతి స్వింగ్‌ అవ్వడం కష్టమే! 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు అవ్వనుంది. ఎండ కాసినా చీకటి పడ్డాక ఫ్లడ్‌లైట్ల కిందే పరుగులు చేయడం సులువు. స్పిన్నర్లకూ పిచ్‌ నుంచి సహకారం అందుతుంది.

Published at : 12 Jul 2022 05:09 PM (IST) Tags: Rohit Sharma Hardik Pandya India vs England IND vs ENG Suryakumar Yadav Ben Stokes Jos Buttler jonny bairstow Liam Livingstone ind vs eng highlights IND vs ENG 1st ODI

ఇవి కూడా చూడండి

Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్‌ కాంట్రాక్ట్ పొడిగింపు

Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్‌ కాంట్రాక్ట్ పొడిగింపు

Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్‌ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు

Mukesh Kumar:  ఘనంగా టీమిండియా పేసర్‌ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు

Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్‌ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్‌ గన్‌

Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్‌ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్‌ గన్‌

Wrestling Federation of India: రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

Wrestling Federation of India: రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత

టాప్ స్టోరీస్

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!