By: ABP Desam | Updated at : 05 Mar 2022 12:12 PM (IST)
Edited By: Ramakrishna Paladi
రవీంద్ర జడేజా
Shane Warne, Rock star Ravindra Jadeja: విధి ఆడే నాటకాలు వింతగానే ఉంటాయి! అరగంట ముందే మరో క్రికెటర్ మరణం గురించి Shane Warne సంతాపం ప్రకటించడమేంటి? అంతలోనే ఆయనే మరణించడమేంటి? ఆ మరుసటి రోజే ఆయన 'రాక్ స్టార్'గా వర్ణించిన కుర్రాడు శ్రీలంకపై సెంచరీ కొట్టడమేంటి? తలచుకుంటే అంతా విచిత్రంగా అనిపిస్తోంది!
టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంటే షేన్‌వార్న్ (Shane Warne)కు ఎంతో ఇష్టం! 2008లో రాజస్థాన్ రాయల్స్‌కు షేన్‌వార్న్ Shane Warne సారథ్యం వహించాడు. అరంగేట్రం ఐపీఎల్‌ను అందించాడు. అదే జట్టుకు రవీంద్ర జడేజా ఆడాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతడూ సభ్యుడే. అప్పుడే లీగ్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. తన బౌలింగ్, బ్యాటింగ్‌ను ఇంఫ్రూవ్ చేసుకొనేందుకు కష్టపడేవాడు.
రవీంద్ర జడేజాను చూసిన షేన్‌వార్న్ 'ఈ కుర్రాడు ఇండియన్ క్రికెట్లో రాక్‌స్టార్' అవుతాడని ప్రశంసించాడు. క్రికెట్ కామెంటేటర్ హర్షబోగ్లేతో చాలాసార్లు ఈ విషయం చెప్పాడు. మీడియా సమక్షంలోనూ అనేవాడు. తానేమీ పాడటం లేదు, డ్యాన్సులు చేయడం, కనీసం స్టైలిష్‌గానూ లేను. కానీ షేన్‌వార్న్ ఎందుకలా అనేవాడో అర్థమయ్యేది కాదని జడ్డూ చెప్పేవాడు. అతడిలోని కష్టపడే తత్వం చూసి ఆ లెజెండ్ అలా అనేవాడని తర్వాత తెలిసింది.
Shane Warne షేన్‌వార్న్ అన్నట్టుగానే రవీంద్ర జడేజా ఇప్పుడో రాక్‌స్టార్‌గా మారిపోయాడు. మణికట్టు స్పిన్నర్ల రాకతో జట్టులో చోటు దొరక్క ఇబ్బంది పడ్డ అతడే ఇప్పుడు టీమ్‌ఇండియాకు ఇంపార్టెంట్ అయిపోయాడు. తన బౌలింగ్, బ్యాటింగ్‌ను మరింత ఇంఫ్రూవ్ చేసుకున్నాడు. టీ20, వన్డేల్లో దూకుడుగా, టెస్టుల్లో నిలకడగా పరుగులు చేస్తున్నాడు. తాజాగా మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ చేశాడు.
శ్రీలంక బౌలర్లపై పూర్తిగా అథారిటీ చూపించిన రవీంద్ర జడేజా 166 బంతుల్లో 10 బౌండరీలతో 102 పరుగులు చేసింది. అతడి ఇన్నింగ్స్‌లో బ్యూటిఫుల్ కవర్‌డ్రైవ్‌లు ఎన్నో ఉన్నాయి. అతడి సహచరుడు రవిచంద్రన్ అశ్విన్ (61) హాఫ్ సెంచరీ చేశాడు. రెండో రోజు లంచ్ టైమ్‌కు టీమ్‌ఇండియా 112 ఓవర్లకు 468/7తో నిలిచింది. జడ్డూ, జయంత్ యాదవ్ (2) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.
'Rockstar' @imjadeja 👏👏@Paytm #INDvSL pic.twitter.com/JG25othE56
— BCCI (@BCCI) March 5, 2022
Team India Squad: ఆసియాకప్‌కు తిరిగొస్తున్న కోహ్లీ - 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ!
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు
CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్‌లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం
108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?