News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ICC WC 2022: అమ్మాయిలూ 'తగ్గేదే లే' అనిపించండి - పాక్‌ పోరుకు ముందు మిథాలీ సేనకు కోహ్లీ విషెస్‌

ICC WC 2022 IND W vs PAK W: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తో మ్యాచుకు ముందు టీమ్ఇండియాకు విరాట్ కోహ్లీ విషెస్ చెప్పాడు.

FOLLOW US: 
Share:

ICC WC 2022 IND W vs PAK W: భారత మహిళల క్రికెట్‌ జట్టుకు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ (Virat Kohli) శుభాకాంక్షలు తెలియజేశాడు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఇండియాకు తీసుకురావాలని ఆకాంక్షించాడు. దేశమంతా వారికి అండగా నిలవాలని కోరుకున్నాడు. వారికి ఉత్సాహపరిచేందుకు ఇంతకన్నా మంచి సమయం ఉండదని అంటున్నాడు.

'టీమ్‌ఇండియా మహిళల జట్టును ఉత్సాహపరిచేందుకు ఇంతకన్నా బెటర్‌ టైమ్‌ ఉండదు. హమారా బ్లూ బంధన్‌ బలాన్ని చూపించాలి. ఎందుకంటే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022కు వేళైంది. 2022, మార్చి 6, ఉదయం 6:30 గంటలకు మీ అలారం సెట్‌ చేసుకోండి. స్టార్‌స్పోర్ట్స్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్ వీక్షించండి' అని ఓ వీడియోను ట్వీట్‌ చేశాడు.

మార్చి 6 నుంచి టీమ్‌ఇండియా పోరాటం

Womens World Cup 2022: మార్చి 4 నుంచి న్యూజిలాండ్‌ వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్‌ వన్డే ప్రపంచకప్‌ మొదలవుతోంది. మొత్తం ఎనిమిది జట్లు 29 రోజులు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు భారత మహిళల క్రికెట్‌ జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. కానీ రెండు సార్లు ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచింది. చివరి ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై కన్నీరు కార్చింది. ఈ సారి ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని పట్టుదలతో ఉంది. మార్చి 6, ఆదివారం నుంచి మిథాలీ సేన తమ క్యాంపెయిన్‌ ఆరంభించనుంది. తొలి మ్యాచులోనే దాయాది పాకిస్థాన్‌తో తలపడుతోంది.

India Schedule - టీమ్‌ఇండియా షెడ్యూలు

భారత్‌ vs పాకిస్థాన్‌ (IND vs PAK) - మార్చి 6 2022 - 6:30 AM IST - బే ఓవల్‌, టౌరంగ (Tauranga)
న్యూజిలాండ్‌ vs భారత్‌ - మార్చి 10 2022 - 6:30 AM IST - సెడాన్‌ పార్క్‌ (Seddon Park), హామిల్టన్‌
భారత్‌ vs వెస్టిండీస్‌ - మార్చి 12 2022 - 6:30 AM IST - సెడాన్‌ పార్క్‌, హామిల్టన్‌
ఇంగ్లాండ్‌ vs భారత్‌ - మార్చి 16 2022 - 6:30 AM IST  - బే ఓవల్‌ (Bay Oval), టౌరంగ
ఆస్ట్రేలియా vs భారత్‌ - మార్చి 19 2022 - 6:30 AM IST 
బంగ్లాదేశ్‌ vs భారత్‌ - మార్చి 22 2022 - 6:30 AM IST 
భారత్‌ vs దక్షిణాఫ్రికా - మార్చి 27 2022 - 6:30 AM IST

Where to Watch Team India matches। ప్రత్యక్ష ప్రసారం

ఐసీసీ మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ 2022 ప్రసార హక్కులను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. భారత్‌, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్‌, భూటాన్‌లో స్టార్‌ మాత్రమే క్రికెట్‌ ప్రపంచకప్‌ను ప్రసారం చేయనుంది. స్టార్‌స్పోర్ట్స్‌ 2/హెచ్‌డీ, స్టార్‌స్పోర్ట్స్‌ 3, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీలో మ్యాచులు వస్తాయి. ICC Women's Cricket World Cup 2022 Live streaming లైవ్‌ స్ట్రీమింగ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో వస్తుంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌లో యుప్‌టీవీ ద్వారా స్ట్రీమింగ్‌ చూడొచ్చు.

India Squad - టీమ్‌ఇండియా జట్టు

మిథాలీ రాజ్‌ (Mithali Raj captain), హర్మన్‌ప్రీత్‌ కౌర్ (Harmanpreet Kaur), స్మృతి మంధాన (Smriti Mandhana), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, స్నేహ్‌ రానా, జులన్‌ గోస్వామి, పూజా వస్త్రాకర్‌, మేఘనా సింగ్‌, రేణుకా సింగ్ ఠాకూర్‌, తానియా భాటియా, రాజేశ్వరీ గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌

Published at : 02 Mar 2022 06:41 PM (IST) Tags: Mithali Raj Virat Kohli India vs Pakistan smriti mandhana ICC Womens World Cup 2022 India women cricket team IND W vs PAK W

ఇవి కూడా చూడండి

Narendra Modi Stadium: వరల్డ్‌కప్‌ ఫైనల్ పిచ్‌ యావరేజ్ అట, భారత్‌లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్‌

Narendra Modi Stadium: వరల్డ్‌కప్‌ ఫైనల్ పిచ్‌ యావరేజ్ అట, భారత్‌లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్‌

నాకు ముందుకు సాగడమే తెలుసు , మిచెల్‌ జాన్సన్‌ విమర్శలపై వార్నర్‌

నాకు ముందుకు సాగడమే తెలుసు , మిచెల్‌ జాన్సన్‌ విమర్శలపై వార్నర్‌

Sreesanth vs Gambhir: ముదురుతున్న గంభీర్‌- శ్రీశాంత్‌ వివాదం, శ్రీశాంత్‌కు లీగల్‌ నోటీసులు జారీ

Sreesanth vs Gambhir: ముదురుతున్న గంభీర్‌- శ్రీశాంత్‌ వివాదం, శ్రీశాంత్‌కు లీగల్‌ నోటీసులు జారీ

T20 World Cup 2024 logo: టీ 20 ప్రపంచకప్‌ ఏర్పాట్లు షురూ, ఆకట్టుకుంటున్న లోగోలు

T20 World Cup 2024 logo: టీ 20 ప్రపంచకప్‌ ఏర్పాట్లు షురూ, ఆకట్టుకుంటున్న లోగోలు

sreesanth vs gambhir : శ్రీశాంత్‌-గంభీర్‌ మాటల యుద్ధం, షాక్‌ అయ్యానన్న శ్రీశాంత్‌ భార్య

sreesanth vs gambhir : శ్రీశాంత్‌-గంభీర్‌ మాటల యుద్ధం, షాక్‌ అయ్యానన్న శ్రీశాంత్‌ భార్య

టాప్ స్టోరీస్

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?