అన్వేషించండి

Garry Kasparov: రాయ్‌బరేలీలో గెలవండి- రాహుల్‌పై చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ కామెంట్స్- సంచలనం రేపుతున్న పోస్ట్‌

Telugu News కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ మొదట రాయ్‌బరేలీలో గెలవాలంటూ కాస్పరోవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవ్వటంతో , తన ఉద్దేశం వేరంటూ కాస్పరోవ్‌ మరో పోస్ట్‌ చేశాడు.

Kasparov Comments On Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ‌ర‌ల్డ్ చెస్ మాజీ ఛాంపియ‌న్ గ్యారీ కాస్ప‌రోవ్ (Garry Kasparov) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తర్వాత జోక్ అంటూ చెప్పినా దుమారం మరింత రేగిందే తప్ప శాంతించలేదు. తను సరదాగా చేసిన వ్యాఖ్యలు  అనవసరంగా పక్కదారి పట్టాయి అని వివరించారు. 

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. రాజకీయనాయకులే కాదు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు మాట్లాడినా అవి పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి మంచి ఎగ్జాంపుల్‌ గ్యారీ కాస్ప‌రోవ్ చేసిన ట్వీట్. రాహుల్ గాంధీ పోటీపై ఆయన చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారడంతోపాటు విమర్శలు అదేస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఇప్పుడు ఆ పార్టీ కంచుకోట, తన తల్లి సోనియాగాంధీ విడిచిపెట్టిన రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారు. ఈ మధ్య కాలంలో అన్ని ప్రాంతాల్లో జనాలతో కలుస్తూ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో నిన్న నామినేషన్ వేశారు.. ప్రచారంలో భాగంగా ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ... పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తన అభిమాన చెస్‌ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్‌ అని, రాజకీయాలన్నా, చెస్‌ అన్నా తనకు ఇష్టం అన్నారు. రాజకీయాలకు, చదరంగానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయన్న రాహుల్... ఆటపై ఒక్కసారి దృష్టి సారిస్తే ప్రత్యర్థి పావులు సైతం మన సొంతమవుతాయని తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చదరంగం ఆటగాడ్ని అని పేర్కొన్నారు. ఈ సరదా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

కాంగ్రెస్‌ పోస్టుపై చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అలా స్పందించిన వ్యక్తుల్లో చెస్‌ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ కూడా చేరిపోయారు. చెస్‌లో అగ్రస్థానానికి పోటీపడి గెలిచే ముందు మొదట రాయ్‌బరేలీలో గెలవాలని పోస్ట్ పెట్టారు. రాహుల్​పై కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. అంతేకాక ఈ విషయంపై కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

"నా చిన్న జోక్‌ భారత రాజకీయాలపై ప్రభావం చూపదని నేను భావిస్తున్నాను. కానీ నాకు అత్యంత ఇష్టమైన ఆటను ఓ రాజకీయ నాయకుడు ఆడటాన్ని మాత్రం చూడకుండా ఉండలేని. దాని కోసం వెయ్యి కళ్లతో ఎదుుర చూస్తుంటాను. " అని రెండోసారి పోస్టు చేశారు. 

ఈ కామెంట్స్ వైరల్ కావడం అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కాస్పరోవ్‌ మరో పోస్ట్ పెట్టారు. భారత రాజకీయాలపై తను జోక్ చేశాను అన్నారు. రాజకీయ నాయకులను చమత్కరించడం తనకు ఎంతో ఇష్టమైన ఆట అన్నారు కాస్పరోవ్‌. అయితే అసలే ఎన్నికల వేళ కావడంతో రాహుల్ ప్రత్యర్థులు కాస్పరోవ్ వ్యాఖ్యల్ని వైరల్ చేస్తున్నారు. 

రష్యాకు చెందిన 61 ఏళ్ల కాస్పరోవ్‌  22 ఏళ్లకే  ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించారు. చెస్‌లో ప్రపంచ విజేతగా నిలిచారు. 2005లో రిటైర్ అయిన ఆయన.. రష్యా అధినేత పుతిన్‌పైన కూడా  ఇలా చాలా  విమర్శలు చేసారు. కొన్నేళ్ల క్రితం రష్యా నుంచి పారిపోయి.. ప్రస్తుతానికి  క్రొయేషియాలో తలదాచుకుంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget