Lionel Messi Hat Trick : మెస్సి మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. ఆల్ టైమ్ హై గోల్స్ హిస్టరీని సమం చేస్తూ అల్జీరియాపై హాట్రిక్ గోల్స్ తో విధ్వంసం
Lionel Messi: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ హాట్రిక్ గోల్స్ కొట్టి అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

Lionel Messi Achieves Historic Landmark Scoring Treble: ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి తన సుదీర్ఘ కెరీర్‌లో మరో అద్భుతమైన చాప్టర్ యాడ్ చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను లీడ్ చేస్తూ అల్జీరియాపై 3-0 తేడాతో ఘనవిజయం సాధించడంలో మెస్సి కీ రోల్ ప్లే చేశాడు. 38 ఏళ్ల వయసులో మెస్సి వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ ఎవర్ హాట్రిక్ గోల్స్ సాధించి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ హాఫ్ లో ఒక గోల్ కొట్టిన మెస్సి, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే సింపుల్ టాప్-ఇన్ తో రెండో గోల్ చేశాడు. ఆ తర్వాత 76వ నిమిషంలో తన ట్రేడ్‌మార్క్ స్టైల్లో మూడో గోల్ పూర్తి చేసి హాట్రిక్ నమోదు చేశాడు. దీంతో ఆరోహెడ్ స్టేడియంలో ఉన్న వేలాది మంది అర్జెంటీనా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. మెస్సి కెరీర్‌లో ఇది 61వ హాట్రిక్ కాగా అర్జెంటీనా తరఫున 11వ హాట్రిక్ కావడం విశేషం. ఈ ట్రెబుల్ తో వరల్డ్ కప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన ప్లేయర్‌గా మెస్సి నిలిచాడు.
🐐 Magic from Messi once again!
— Okoliko Jnr 💎 (@Jossypet612) June 17, 2026
⚽⚽⚽ Hat-trick hero as Messi leads Argentina to a dominant victory over Algeria. Pure class from the GOAT. 🇦🇷🔥#Messi #LionelMessi #Argentina #HatTrick #GOAT #Football #Soccer #FootballHighlights #FootballTwitter #MessiMagic pic.twitter.com/W3dfTgaHxK
క్లోజ్ రికార్డ్ సమం..
ఈ మ్యాజికల్ ఈవెనింగ్ మెస్సి లైఫ్ లో చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది. మెస్సి 2006 లో జర్మనీ వేదికగా సెర్బియా, మోంటెనెగ్రోపై వరల్డ్ కప్ డెబ్యూ మ్యాచ్ ఆడి గోల్ కొట్టాడు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే రోజున ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. అర్జెంటీనా తరఫున 200వ అప్పీయరెన్స్ ఇచ్చిన ఈ ఎనిమిది సార్లు బ్యాలన్ డి ఓర్ విన్నర్, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఐదు వేర్వేరు వరల్డ్ కప్ ఎడిషన్లలో గోల్స్ చేసిన సెకండ్ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. ఈ హాట్రిక్ తో మెస్సి వరల్డ్ కప్ టోటల్ గోల్స్ సంఖ్య 16కు చేరింది. జర్మనీ లెజెండ్ మిరొస్లావ్ క్లోజ్ చాలా కాలంగా మెయింటైన్ చేస్తున్న ఆల్ టైమ్ గోల్ స్కోరింగ్ (16 గోల్స్) రికార్డును మెస్సి సమం చేశాడు. అర్జెంటీనా డిఫెన్స్ టైటిల్ రేసులో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో మెస్సి ఈ రికార్డును బ్రేక్ చేయడం చాలా ఈజీ అని అనిపిస్తోంది.
ఎంబాపె, హాలాండ్ రికార్డ్స్ ఔట్..
మెస్సి సృష్టించిన విధ్వంసం వల్ల ఇతర ఫుట్‌బాల్ స్టార్స్ చేసిన అద్భుతాలు మరుగునపడిపోయాయి. ఫ్రాన్స్ ఫార్వర్డ్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె సైతం సెనెగల్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి తన టీమ్‌ను 3-1 తో గెలిపించాడు. ఎంబాపె వరల్డ్ కప్‌లో తన టోటల్ గోల్స్ సంఖ్యను 14కు చేర్చి వెస్ట్ జర్మనీ గ్రేట్ గెరార్డ్ ముల్లర్ సరసన ఫోర్త్ ప్లేస్ లో నిలిచాడు. ఇటు నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ కూడా ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టి తన టీమ్‌కు 4-1 తో బిగ్ విక్టరీ అందించాడు. కానీ ఆ నైట్ మాత్రం కంప్లీట్‌గా అర్జెంటీనా ఐకాన్ మెస్సినే తన మాయతో హైజాక్ చేశాడు.
కాన్సాస్ సిటీలో మెస్సి మేనియా
అర్జెంటీనా టీమ్ కాన్సాస్ సిటీకి వచ్చినప్పటి నుంచి అక్కడ 'మెస్సి మేనియా' పీక్స్‌కు చేరింది. ఆరోహెడ్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ మెస్సి ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి. ఐకానిక్ నంబర్ 10 జెర్సీలు వేసుకున్న వేలాది మంది ఫ్యాన్స్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) కు హోమ్ గ్రౌండ్ అయిన ఈ స్టేడియాన్ని బ్లూ అండ్ వైట్ కలర్‌తో నింపేశారు. రోసారియో నుంచి వచ్చిన తమ హీరోను పొగుడుతూ పాటలు పాడుతూ స్టేడియంలో హోరెత్తించారు. అమెరికాలో మెస్సి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ మ్యాచ్ ప్రజెంటేషన్ స్పష్టం చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















