అన్వేషించండి

FIFA World Cup Drama: అమెరికాలో ఇరాన్ టీమ్‌కు ఊహించని షాక్, అర్ధరాత్రి US ఖాళీ చేయాలని ఆర్డర్.. కోచ్ ఫైర్..!

న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ 2-2తో ముగిసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఫుట్‌బాల్ జట్టును అమెరికా వదిలి మెక్సికో వెళ్లాలని ఆదేశించడం తీవ్ర కలకలం రేపుతోంది.

Iran had Ordered To Leave US: ఇరాన్, అమెరికా మ‌ధ్య డీల్ జ‌రిగి యుద్దం ఆగినా, అది ఫిఫా వ‌రల్డ్ క‌ప్ లో ఇంకా కొన‌సాగుతున్న‌ట్లుగానే ఉంది. త‌మ‌దేశంలో ప్ర‌పంచ‌క‌ప్ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడ‌టానికి వ‌చ్చిన త‌మ ప‌ట్ల అమెరికా నిర్ద‌య‌గా ప్ర‌వ‌ర్తించింద‌ని ఇరాన్ ఆట‌గాళ్లు ఆరోపిస్తున్నారు. మ్యాచ్ ముగిశాక‌, విశ్రాంతి తీసుకునే స‌మ‌యం కూడా ఇవ్వ‌కుండా దేశం విడిచి పెట్టి వెళ్లాల‌ని అన‌డంపై ఆట‌గాళ్లు, కోచ్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Read Also: Vaibhav Sooryavanshi Struggles: ఐపీఎల్ హీరోకి లంక పిచ్‌లపై చేదు అనుభవం - వ‌న్డేల్లో తేలిపోతున్న టీనేజ‌ర్.. టీ20 హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని హిత‌వు!

డ్రా మ్యాచ్ తర్వాత అర్ధరాత్రి హైడ్రామా..
ఇరాన్ తన పొలిటికల్లీ ఛార్జ్డ్ వరల్డ్ కప్ క్యాంపెయిన్‌ను న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా ఓపెన్ చేసింది. రెండు సార్లు వెనుకబడినప్పటికీ ఇరాన్ ప్లేయర్స్ అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన సంతోషం కూడా లేకుండానే ఆ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. కాలిఫోర్నియాలోనే రాత్రి స్టే చేసి రికవరీ అవ్వాలని ఇరాన్ ప్లాన్ చేసుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే హోటల్‌కు కూడా వెళ్లకుండా 140 మైళ్ల దూరంలో ఉన్న మెక్సికో సరిహద్దు నగరం టిజువానాలోని బేస్ క్యాంప్‌నకు వెంటనే ఫ్లైట్ ఎక్కాలని ఆర్డర్స్ వచ్చాయి. తమకు కనీసం రికవరీ టైమ్ కూడా ఇవ్వలేదని ఇరాన్ కోచ్ అమీర్ ఘాలెనోయి వాపోయాడు. ఈ డెసిషన్స్ ఎవరు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని, చాలా విచిత్రంగా ఉందని ఇంటర్‌ప్రెటర్ ద్వారా అసంతృప్తి వెళ్లగక్కాడు. వరల్డ్ కప్‌లో తమ టీమ్ తీవ్రమైన అణచివేతకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Read Also: Vaibhav Suryavanshi: లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?

యూఎస్ వీసా తిరస్కరణలతో ముందే ఇబ్బందులు
ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఇరాన్ వరల్డ్ కప్ ప్రయాణం తీవ్ర ఇబ్బందుల మధ్య సాగుతోంది. అమెరికా నుంచి తమ గ్రూప్ మ్యాచ్‌లను వేరే చోటికి మార్చాలని ఇరాన్ చేసిన రిక్వెస్ట్‌ను ఫిఫా రిజెక్ట్ చేసింది. దాంతో ఇరాన్ ఇక్కడే ఆడటానికి రెడీ అయింది. దీనికి తోడు ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, కోచింగ్ స్టాఫ్, మీడియా అఫీషియల్స్‌కు అమెరికా వీసాలు ఇవ్వకుండా నిరాకరించింది. దీనివల్ల ముఖ్యమైన సపోర్ట్ స్టాఫ్ లేకుండానే టీమ్ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ప్రతిదీ ఒక డిజాస్టర్‌లా మారిందని ఇరాన్ కెప్టెన్ మెహదీ తారెమి ఆవేదన వ్యక్తం చేశాడు. లాస్ ఏంజెల్స్ నుంచి ఈ అర్ధరాత్రి వెంటనే వెళ్లిపోవాల్సి రావడం ప్లేయర్స్ హెల్త్‌కు అస్సలు మంచిది కాదని, ఫిఫా తమకు హెల్ప్ చేయాలని కోరాడు.

స్టేడియంలో పొలిటికల్ హీట్
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో న్యూజిలాండ్ రెండు సార్లు లీడ్ సాధించినా, ఇరాన్ ప్లేయర్స్ గట్టిగా ఫైట్ చేశారు. ఇరాన్ తరఫున 64వ నిమిషంలో మహ్మద్ మొహెబ్బీ కీలకమైన ఈక్వలైజర్ గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. స్టేడియం అంతా ఇరాన్ సపోర్టర్స్‌తో నిండిపోయింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఇరానియన్ అమెరికన్ ఫ్యాన్స్ ప్రొటెస్ట్ చేశారు. ఇన్ని పొలిటికల్ టెన్షన్స్ మధ్య మ్యాచ్ ఆడిన ఇరాన్ టీమ్‌ను వెంటనే పంపించేయడం సంచలనంగా మారింది. ఇరాన్ తన నెక్స్ట్ మ్యాచ్‌ను కూడా సోఫి స్టేడియంలోనే బెల్జియంతో ఆదివారం ఆడాల్సి ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget