అన్వేషించండి

Vaibhav Sooryavanshi Struggles: ఐపీఎల్ హీరోకి లంక పిచ్‌లపై చేదు అనుభవం - వ‌న్డేల్లో తేలిపోతున్న టీనేజ‌ర్.. టీ20 హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని హిత‌వు!

ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి రికార్డులు సృష్టించిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ లంక టూర్‌లో ఫామ్ కోల్పోయి ఒత్తిడిలో పడ్డాడు. వ‌న్డేల‌లో విఫ‌ల‌మై అభిమానుల‌ను నిరాశ ప‌రుస్తున్నాడు.

IPL Success Followed By International Failures: కేవలం నెల రోజుల క్రితం వరకు ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 16 మ్యాచ్‌లలో 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్ సూర్యవంశీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జస్‌ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఊచకోత కోస్తూ భారీ సిక్సర్లు బాదిన ఈ 15 ఏళ్ల సంచలనానికి ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లే సీనియర్ ఇండియా టీమ్‌లో కూడా చోటు దక్కింది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత సీన్ కంప్లీట్‌గా రివర్స్ అయింది. శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో ఇండియా ఏ టీమ్ తరఫున ఆడుతున్న వైభవ్ ఘోరంగా తడబడుతున్నాడు.

Read Also: Vaibhav Suryavanshi: లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?

వ‌న్డేల‌లో కన్సిస్టెన్సీ మిస్

ట్రై-సిరీస్‌లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో వైభవ్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఒకే తరహాలో అవుట్ అవ్వడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది. ఇన్నింగ్స్ స్టార్టింగ్‌లో కొన్ని క్లాస్ ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించినా ఆ తర్వాత వికెట్ పారేసుకుంటున్నాడు. మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 14, 44, 21 రన్స్ మాత్రమే చేశాడు. సోమవారం శ్రీలంక ఏ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో చమిక గుణశేఖర వేసిన ఒకే ఓవర్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టి జోరు చూపించినా లంక కెప్టెన్, స్పిన్నర్ సహన్ అరాచ్చిగే వేసిన స్లో బాల్‌కు భారీ షాట్ ఆడబోయి వనుజ సహన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతకుముందు అఫ్గానిస్తాన్‌పై 44 రన్స్ వద్ద అబ్దుల్ రహ్మాన్ షార్ట్ బాల్‌కు పెవిలియన్ చేరాడు.

Read Also: Vaibhav Sooryavanshi Hard Work: రోజూ 8 గంటల ప్రాక్టీస్, 100 ఓవర్ల బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్ -  వండర్ కిడ్ వెనుక ఉన్న కష్టం ఇదీ!

సూపర్ ఓవర్ ప్రెజర్, లంక ప్లేయర్ తో గొడవ

శ్రీలంక ఏ టీమ్‌తో జరిగిన టై మ్యాచ్‌లో ఇండియాను గెలిపించేందుకు వైభవ్‌కు సూపర్ ఓవర్ రూపంలో రెండో ఛాన్స్ దక్కింది. 17 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన వైభవ్ కేవలం 3 బంతుల్లో 6 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ప్రెజర్ కంట్రోల్ చేసుకోలేక కేవలం ఒకే ఒక్క ఫోర్ కొట్టి చేతులెత్తేయడంతో ఇండియా ఏ టీమ్ ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత గ్రౌండ్ లో ఎమోషన్స్ హీటెక్కాయి. లంక బౌలర్ కుగదాస్ మథులన్ సెలబ్రేషన్స్ చూసి కోపంతో ఊగిపోయిన వైభవ్ అతనితో వాగ్వాదానికి దిగాడు. మధ్యలో వచ్చిన లంక ప్లేయర్ వి షేన్ హలంబగేను వైభవ్ నెట్టడంతో సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడదీశాడు. ఈ ప్రవర్తనతో వైభవ్ ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంది.

వన్డే ఫార్మాట్ లో సత్తా చాటాల్సిన టైమ్

టి20 క్రికెట్ హ్యాంగోవర్ నుంచి వైభవ్ ఇంకా బయటకు రాలేకపోతున్నాడని స్పోర్ట్స్ అనలిస్టులు చెప్తున్నారు. 50 ఓవర్ల వన్డే ఫార్మాట్‌లో ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి చాలా టైమ్ ఉంటుంది కానీ వైభవ్ ప్రతి బాల్‌ను బాదాలనే తొందరలో పేషెన్స్ కోల్పోతున్నాడు. ఇండియా ఫ్యూచర్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కారణంగా మీడియా ఫోకస్ మొత్తం అతని మీదే ఉంది. ప్రతీ షాట్‌ను మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తుండటంతో 15 ఏళ్ల కుర్రాడిపై విపరీతమైన ప్రెజర్ పడుతోంది. ఈ గడ్డు కాలం నుంచి వైభవ్ ఎలా కంబ్యాక్ ఇస్తాడనే దానిపైనే అతని కెరీర్ ఆధారపడి ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahane Struggle Days: రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget