News
News
X

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇలా చేస్తే జైలుకే!

ఖతార్‌లో జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లే అవకాశం ఉంది.

FOLLOW US: 
 
ఆదివారం నుంచి ఖతార్‌లో ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచ కప్ 2022 కోసం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే ఈ ప్రపంచ కప్‌లో మహిళా అభిమానులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. దేశంలోని కఠినమైన చట్టాల ప్రకారం శరీరం ఎక్కువగా కనిపించే దుస్తులను ధరిస్తే వారిని జైలులో వేసే అవకాశం ఉంది.

ఖతార్ దేశానికి చెందని మహిళలు 'అబాయా' అని పిలిచే సాంప్రదాయిక పొడవాటి నల్లని వస్త్రాన్ని ధరించాలని అధికారిక ఆదేశాలు ఏమీ లేవు. కానీ వారు తమ భుజాలు, మధ్యభాగం లేదా మోకాళ్లను బహిర్గతం చేసే దుస్తులకు దూరంగా ఉండాలి. ఫిఫా వెబ్‌సైట్‌లో కూడా ఇదే తెలిపారు. అభిమానులకు వారి ఇష్టానికి అనుగుణంగా దుస్తులు ధరించవచ్చు. కానీ ఖతార్ చట్టాలను గౌరవించాలి.

"ప్రజలు సాధారణంగా తమకు నచ్చిన దుస్తులను ధరించవచ్చు. మ్యూజియంలు, ఇతర ప్రభుత్వ భవనాలు వంటి బహిరంగ ప్రదేశాలను సందర్శించేటప్పుడు సందర్శకులు వారి భుజాలు, మోకాళ్లను కప్పి ఉంచితే మంచిది. హోటల్ బీచ్‌లు, కొలనుల వద్ద ఈత దుస్తులను అనుమతిస్తారు. మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు షర్టులను తీసివేయడాన్ని స్టేడియంలో అనుమతించరు." అని ఫిఫా వెబ్‌సైట్లో పేర్కొంది.

ఖతార్ విదేశీయుల కోసం దుస్తుల కోడ్‌ను చట్టపరంగా ఎక్కడా పేర్కొనలేదు. అయితే సందర్శకులు, అభిమానులు ఇస్లామిక్ సంస్కృతి ప్రకారం "నమ్రత" ప్రదర్శించే దుస్తులను ధరించాలని భావిస్తున్నారు. దీనర్థం పురుషులు ఎల్లప్పుడూ షార్ట్‌లు కాకుండా పొడవాటి ప్యాంట్లు ధరిస్తే మంచిది. అలాగే నచ్చినప్పుడు షర్టులు విప్పేయకూడదు. ఇక మహిళలు మినీ స్కర్ట్‌లు, ట్యాంక్ టాప్‌లకు దూరంగా ఉండాలి. ఖతార్‌లో మహిళలు బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం నిషేధితం అయిందని తెలుస్తోంది.

News Reels

“ఖతార్‌లోని మహిళలు హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదు. అయితే స్థానిక దుస్తుల కోడ్‌ను గమనించాలి. పురుషులు, స్త్రీలు భుజాలు, పై చేతులను కప్పి ఉంచుకోవాలి. షార్ట్‌లు లేదా స్కర్టులు/డ్రెస్‌లు మోకాలి వరకు లేదా అంతకంటే కిందకు ఉండాలి.” అని ఖతార్‌లోని బ్రిటీష్ రాయబార కార్యాలయం సూచించింది. 

View this post on Instagram
 
A post shared by FIFA World Cup (@fifaworldcup)

Published at : 17 Nov 2022 11:06 PM (IST) Tags: FIFA World Cup FIFA World Cup Qatar FIFA World cup 2022 FIFA World Cup Dress Code

సంబంధిత కథనాలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

FIFA World Cup 2022 Qatar: ఫిఫాలో క్వార్టర్స్ చేరని స్పెయిన్- ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్ రాజీనామా

FIFA World Cup 2022 Qatar: ఫిఫాలో  క్వార్టర్స్ చేరని స్పెయిన్- ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్ రాజీనామా

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో భారతీయులు- రెండో స్థానం ఇండియాదే!

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో భారతీయులు- రెండో స్థానం ఇండియాదే!

FIFA WC 2022: ఫిఫా వరల్డ్ కప్‌ క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు పోటీ - ఫేవరెట్స్ ఎవరు?

FIFA WC 2022: ఫిఫా వరల్డ్ కప్‌ క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు పోటీ - ఫేవరెట్స్ ఎవరు?

FIFA WC 2022 Qatar: ప్రి క్వార్టర్స్‌లోరిజర్వు బెంచీపై రొనాల్డొ - అవమానామా? వ్యూహాత్మకమా?

FIFA WC 2022 Qatar: ప్రి క్వార్టర్స్‌లోరిజర్వు బెంచీపై రొనాల్డొ - అవమానామా? వ్యూహాత్మకమా?

టాప్ స్టోరీస్

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?