(Source: ECI/ABP News/ABP Majha)
Devdutt Padikkal: గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు - మూడో టెస్టులో దేవ్‌దత్ ఎంట్రీ!
IND Vs ENG 3rd Test: ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Devdutt Paddikal Stats Records: ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాజ్‌కోట్‌లో భారతదేశం, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరగనుంది. అయితే ఈ టెస్టుకు ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ మూడో టెస్టులో భాగం కావడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ కూడా ఆడటం లేదు. రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు మిగిలి ఉన్నాయి.
అయితే ఇన్ని ప్రశ్నల మధ్య టీమ్ ఇండియాకు శుభవార్త. దేవదత్ పడిక్కల్ రాజ్‌కోట్ టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అందువల్ల ప్లేయింగ్ ఎలెవన్‌లో దేవదత్ పడిక్కల్ ఉండటం టీమ్ ఇండియాకు రిలీఫ్ న్యూస్.
ప్రత్యర్థి బౌలర్లకు దేవదత్ పెద్దికల్ ఇబ్బంది...
గత ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో దేవదత్ పడిక్కల్ నాలుగు సార్లు సెంచరీ మార్కును దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి బ్యాట్స్‌మెన్‌ల గైర్హాజరీని దేవదత్ పడిక్కల్ భర్తీ చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్‌పై దేవదత్ పడిక్కల్ 105 పరుగులు చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో పంజాబ్‌పై 103 పరుగులు చేశాడు. అయితే ఈ బ్యాట్స్‌మన్ ఇక్కడితో ఆగలేదు.
గోవాపై దేవదత్ పడిక్కల్ మళ్లీ సెంచరీ మార్కును దాటాడు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ 103 పరుగులు చేశాడు. దీని తర్వాత తమిళనాడుపై దేవదత్ పడిక్కల్ 151 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో దేవదత్ పడిక్కల్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఇబ్బందిగా మారుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఇంగ్లండ్‌తో జరగనున్న రాజ్‌కోట్ టెస్టులో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం ఖాయమని భావిస్తున్నారు. మూడో టెస్టులో దేవదత్ పడిక్కల్ ఆడితే బ్రిటిష్ బౌలర్ల కష్టాలు పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు శ్రేయస్ అయ్యర్‌కు పాత గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో చేరినట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ తిరిగి ఐపీఎల్‌తో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన అయ్యర్ అంచనాలను అందుకో లేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 26 సగటుతో కేవలం 104 పరుగులు మాత్రమే శ్రేయస్ అయ్యర్ చేశాడు.
శ్రేయస్ అయ్యర్ దూరమవ్వడంతో అతని స్థానంలో దేశవాళీలో పరుగుల వరద పాలిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ మిగిలిన టెస్టులకు కూడా అందుబాటులో ఉండబోవడం లేదు. ఈ నెల 15వ తేదీ నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు. ఈ నెల 23వ తేదీ నుంచి రాంచీ నాలుగో టెస్ట్, మార్చి 7వ తేదీ నుంచి ధర్మశాలలో అయిదో టెస్ట్ జరగనున్నాయి. అంతే కాకుండా తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజా తుది జట్టులో చేరడం కష్టంగా తెలుస్తోంది. రవీంద్ర జడేజా గాయం చాలా తీవ్రమైందని, దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందన్న వార్తలు వస్తున్నాయి.