Cristiano Ronaldo Newborn Twins: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట విషాదం, కవలలు పుట్టారని సంతోషించేలోపే !
Cristiano Ronaldo announces death of baby boy: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట్లో విషాదం. జార్జినా రోడ్రిగెజ్, రొనాల్డో దంపతులకు అప్పుడే జన్మించిన కవలల్లో ఒకరు మృతిచెందడంతో విషాదం నెలకొంది.
Cristiano Ronaldos newborn twin boy dies: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జార్జినా రోడ్రిగెజ్, రొనాల్డో దంపతులకు అప్పుడే జన్మించిన కవలల్లో ఒకరు మృతిచెందారు. ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో భార్య జార్జినా ఇద్దరు కవలలకు సోమవారం రాత్రి జన్మనిచ్చింది. ఓ బాబు, ఓ బేబీ పుట్టారని సంతోషించేలోపే విషాదం జరిగిపోయింది. కవలల్లో తమ బాబు చనిపోయాడని, ఈ విషయం తెలిపేందుకు చాలా చింతిస్తున్నామని పేర్కొంటూ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మా సంతోషం, ఆశ ఆ పాప..
తన భార్య ఓ బాబు, పాపకు జన్మనిచ్చిందని సంతోషించేలోపే తమ ఇంట్లో విషాదం చోటుచేసుకుందని రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఓ బిడ్డ చనిపోతే ఎంత బాధగా ఉంటుందో తల్లిదండ్రులకు తెలుసు. అయితే ప్రస్తుతం మా సంతోషం, ఆశాజ్యోతి ఇప్పుడు పాప మాత్రమే. ఈ కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ క్రిస్టియానో రొనాల్డో ఆ పోస్టులో ధన్యావాదాలు తెలిపాడు. డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కష్టకాలంలో మాకు తోడుగా నిలిచి, తమ బాబు మరణం విషయంలో ప్రైవసీ ఇస్తారని రొనాల్డో ఆకాంక్షిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.
View this post on Instagram
37 ఏళ్ల రొనాల్డో ఫుట్‌బాల్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. 5 సార్లు వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు ఈ సాకర్ స్టార్. రియల్ మాడ్రిడ్, జువెంటస్ తరఫున ఆడి పలు ట్రోఫీలు కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న రొనాల్డో.. గతంలో 2003 నుంచి 2009 మధ్యకాలంలో అదే క్లబ్‌కు సేవలు అందించాడు.