Abhishek Sharma: డకౌట్ అయితే ఆనందించాడు, యువరాజ్‌పై అభిషేక్ సంచలన వ్యాఖ్యలు
Abhishek Sharma: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ సెంచరీ బాది అందరిచేతా వాహ్ అనిపించుకున్నాడు. అయితే అంతకు ముందు మ్యాచ్ లో మాత్రం డకౌట్ అయ్యాడు.

Abhishek Sharma- Yuvaraj singh: జింబాబ్వే(ZIM)తో జరిగిన రెండో టీ 20లో శతకంతో నయా సెన్సేషన్‌గా మారిన తెలుగు కుర్రాడు అభిషేక్ శర్మ(Abhishek Sharma) గురించిన ప్రతీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. యువ భారత్ సారధి శుభ్‌మన్‌గిల్ నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్... ఇప్పుడు మూడో టీ 20పై దృష్టి పెట్టాడు. రేపు జరిగే మ్యాచ్‌లో మరోసారి సత్తా చాటి తన సెంచరీ గాలివాటం కాదని నిరూపించాలన్న కసితో అభిషేక్ ఉన్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో తాను డకౌట్ అయిన అనంతరం యువరాజ్ సింగ్(Yuvaraj singh)... చాలా సంతోషించాడని అభిషేక్ తాజాగా వ్యాఖ్యానించాడు. ఇంతకీ యువరాజ్ ఎందుకు ఆనందించాడంటే..?
Abhishek Sharma doing Video-call to Yuvraj Singh after scoring a terrific hundred. ❤️
— Johns. (@CricCrazyJohns) July 8, 2024
- The boys from Yuvi school making it big. pic.twitter.com/1UeEaMoied
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

