Yashasvi Jaiswal Record : జైస్వాల్ జోరు.. సచిన్ రికార్డు బద్దలు కొట్టిన యువ ఓపెనర్.. ఇంగ్లాండ్ పై తిరుగులేని ఆధిపత్యం..
ఇంగ్లాండ్ అంటే చాలు రెచ్చిపోయి ఆడే జైస్వాల్ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈసారి ఏకంగా సచిన్ నమోదు చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీతో అలరించాడు.

Yashasvi Jaiswal Vs Sachin Tendulkar: ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ (164 బంతుల్లో 118, 14 ఫోర్లు, 2 సిక్సర్లు)తో సత్తా చాటి సంగతి తెలిసిందే. కెరీర్ లో ఆరో సెంచరీ సాధించడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. అలాగే ఈ మ్యాచ్ లో జైస్వాల్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో తన ఇన్నింగ్స్ ద్వారా తొమ్మిదోసారి 50 ప్లస్ స్కోరును దాటాడు. దీంతో ఇంగ్లాండ్ పై 23 ఏళ్ల వయసులో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. తను 19 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనతను సాధించడం విశేషం. గతంలో ఇదే వయసులో ఉన్నప్పుడు 14 ఇన్నింగ్స్ లో సచిన్ 8 50 ప్లస్ స్కోర్లును తన పేరిట లిఖించుకున్నాడు.
MAGNIFICENT HUNDRED FOR YASHASVI JAISWAL...!!!🔥👏
— CRICKET TALENTS (@_CrickeTalents) August 2, 2025
- He smashed a marvellous Hundred Against England in a must situation for India at The Oval.#YashasviJaiswal | #INDvsENG pic.twitter.com/k5TVG3tovn
సూపర్ హిట్..
సేనా కంట్రీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన జాబితాలోకి జైస్వాల్ ఆల్రెడీ చేరి పోయాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో తను పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో తొలి ఓవర్ సీస్ సెంచరీ చేశాడు. అలాగే ఈసారి ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ చేశాడు. ఇక ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అద్బుత సెంచరీ చేయడం ద్వారా కీలక సమయంలో తను జట్టును ఆదుకున్నాడు. అలాగే తనపై వచ్చిన విమర్శలకు దీటైన జవాబిచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ కు దీటైన టార్గెట్ ను టీమిండియా నిర్దేశించింది. ఓవరాల్ గా 374 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందుంచింది.
భారత్ భారీ స్కోరు..
అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు తో రెండో ఇన్నింగ్స్ ను శనివారం కొనసాగించిన భారత్ 396 పరుగుల భారీ స్కోరు సాధించింది. జైస్వాల్ తో పాటు ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) లతో చేలరేగడంతో టీమిండియా.. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ను సెట్ చేసింది. ఈ వేదికపై ఇప్పటివరకు ఛేదించిన అత్యధిక ఛేదన 263 కాగా.. అది కూడా 122 ఏళ్ల కిందట ఛేజ్ చేయబడింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలవాలంటే రికార్డు స్కోరుతో ఛేజింగ్ చేయాల్సిందే. ఇక ఇప్పటికే ఒక వికెట్ తీసిన భారత్.. నాలుగో రోజు మిగతా తొమ్మిది వికెట్లను తీయాలని పట్టుదలగా ఉంది. దీంతో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని సమం చేయాలని భావిస్తోంది. ఏదేమైనా ఈ సిరీస్ లో తొలిసారి ఒక టెస్టు నాలుగు రోజుల్లో ముగియబోతుందని తెలుస్తోంది. అంతకుముందు జరిగిన నాలుగు టెస్టులు ఐదో రోజు వరకు జరిగిన సంగతి తెలిసిందే.




















