Sania Mirza: మహిళా క్రికెట్‌లో WPL ఓ విప్లవం: సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు
RCB mentor Sania Mirza: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మహిళల క్రికెట్‌లో అతిపెద్ద మార్పునకు నాంది పలికిందన్నారు టెన్నీస్‌స్టార్ సానియా మీర్జా.
#WATCH | Delhi: Former Tennis player Sania Mirza says, "...We as a, as a nation, as a society, we have to encourage more and more girls to follow their dreams. We have to encourage more and more girls to do what they love, no matter how out of the box it is. And I think that… pic.twitter.com/PmU1DJ3vxN
— ANI (@ANI) April 5, 2024
అవలీలగా
సానియామీర్జా నవంబర్ 15, 1986న హైద్రాబాద్‌లో జన్మించింది. , తండ్రి ఇమ్రాన్ మీర్జా ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్. తల్లి నసీమా మీర్జా గృహిణి. ఆటపై ష్టంతో 17 ఏళ్ల వయస్సులోనే టెన్నిస్‌లోకి ప్రవేశించింది సానియా. బ్యాక్‌హ్యాండ్ , సర్వ్, వ్యాలీ ఇవి టెన్నిస్ గేమ్ లో చాలా కీలకమైన షాట్లు. ఇలాంటివి అవలీలగా ఆడేయగలదు సానియా.
17 ఏళ్లకే స్టార్‌డమ్
టెన్నిస్‌లోకి ప్రవేశించిన 17 ఏళ్ల వయస్సులో, సానియా మీర్జా(Sania Mirza) 2004లో ప్రపంచ టెన్నిస్ సమాఖ్య టైటిల్‌ను గెల్చుకొంది. అంతేకాదు అలా గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ కూడా తనే. 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీర్జా అదే ఈవెంట్‌లో సింగిల్స్ ట్రోఫీని గెలుచుకుంది, ఈ విజయంతో డబ్ల్యుటీఏ సింగిల్స్ ఈవెంట్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగానూ తను నిలిచింది. అలా టెన్నిస్‌లో సానియా భారత ఆశలను మోయగలను అని చాటుకొంది. అలా తన ప్రయాణం కొనసాగింది.
రికార్డు విజయాలు
2009లో ఎలెనా వెస్నీనా తో కలిసి, 2010లో పెంగ్ షోయ్ తో కలిసి, 2016 లో మార్టినా హింగిస్‌తో కలిసి సానియా ఆస్ర్టేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఇలా7 ఏళ్ల వ్యవధిలో 3 సార్లు టైటిల్ గెలవడం కొత్త రికార్డ్ గా చెప్పొచ్చు. అలాగే 2009లో భారత టెన్నిస్ లెజెండ్ మహేష్ భూపతితో కలిసి తొలిసారిగా ఆమె చరిత్ర సృష్టించింది. వీరిద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. దీంతో మీర్జా గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సొంతం చేసుకున్న మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు.తర్వాత 2012లో భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ను గెలుచుకుంది. 2014లో, సానియా - బ్రూనో సోరెస్‌తో కలిసి అమెరికా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ను సొంతం చేసుకుంది. తర్వాత, సానియా 2015లో వింబుల్డన్ మరియు యూఎస్ ఓపెన్ లో విజయాలు నమోదు చేసి టెన్నిస్ పై తన ఆధిపత్యాన్ని చాటింది.