ఎన్ని గెలిచారో కాదన్నాయ్ కప్ కొట్టారా లేదా- టీమిండియాపై గంభీర్ వివాదాస్పద విశ్లేషణ
Gambhir On Team India: లీగ్ మ్యాచ్‌ల వరకు భారత్ చాలా బాగా ఆడిందని కానీ తర్వాత ఆ స్థాయి ప్రతిభ చూపించలేకపోయిందన్నారు గంభీర్. అందుకే కప్‌ను చేజార్చుకుందన్నారు.
![ఎన్ని గెలిచారో కాదన్నాయ్ కప్ కొట్టారా లేదా- టీమిండియాపై గంభీర్ వివాదాస్పద విశ్లేషణ World Cup Final 2023 Gambhir Controversial Analysis on Team India loss latest telugu news updates ఎన్ని గెలిచారో కాదన్నాయ్ కప్ కొట్టారా లేదా- టీమిండియాపై గంభీర్ వివాదాస్పద విశ్లేషణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/22/72fad175bf15fa4dffba6ebc11704ba41700636524547215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gambhir Analysis On World Cup Final 2023: వరల్డ్‌కప్(World Cup 2023)లో టీమిండియా(Team India ) ఓడిపోవడంపై చర్చోపచర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. వరల్డ్‌కప్‌లో టీమిండియానే అత్యత్తమ జట్టని మాజీలు అభిప్రాయపడుతున్నారు. చివరి మెట్టుపై బోల్తాపడటం అది బలహీనతకు నిదర్శనం కాదని అంటున్నారు. దీనికి పూర్తి విరుద్దమైన ప్రకటన చేశారు మాజీ క్రికెటర్, బీజేపీ లీడర్ గౌతమ్ గంభీర్.
వరల్డ్ కప్‌లో అత్యత్తమ జట్టే విజయం సాధించిందని అన్నారు గౌతమ్ గంభీర్. ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఒత్తడిని తట్టుకొని కప్ గెలుకుచున్న వాళ్లే విజేతలని అదే ఉత్తమ జట్టని తెలిపారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే... "నా వాదన చాలా మందికి నచ్చకపోవచ్చు. ఉత్తమమైన జట్టు వరల్డ్‌కప్ గెలవలేదన్న అభిప్రాయంతో ఏకీభవించలేను. ఆ వాదన చాలా వింతగా ఉంది. గొప్పగా ఆడిన జట్టే వరల్డ్ కప్‌లో విజయం సాధించిది. భారత్ పది మ్యాచ్‌లు విజయం సాధించింది కానీ ఆఖరి మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగింది. ఆస్ట్రేలియా మాత్రం మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత మరింత పరిశ్రమతో కప్ గెలుచుకుంది. వరుసగా గెలిచిన మ్యాచ్‌లతోనే ఉత్తమ జట్టును డిసైడ్ చేయలేరు. లీగ్ దశలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు. కప్ ఎవరు గెలుచుకున్నారనేది గుర్తించాలి. అని గంభీర్ సూచించారు.
లీగ్ మ్యాచ్‌ల వరకు భారత్ చాలా బాగా ఆడిందని కానీ తర్వాత ఆ స్థాయి ప్రతిభ చూపించలేకపోయిందన్నారు గంభీర్. అందుకే కప్‌ను చేజార్చుకుందన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)