అన్వేషించండి

World Cup 2023: సెమీస్‌ చేరే ఆ నాలుగు జట్లేవి, ఎవరికి ఎంత శాతం అవకాశాలు

ODI World Cup 2023: ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ 31 మ్యాచ్‌లు జరగగా బంగ్లాదేశ్‌ ఒక్కటే అధికారికంగా నాకౌట్‌ నుంచి నిష్క్రమించింది. మిగిలిన 9 జట్లకు  సాంకేతికంగా అవకాశాలు ఉన్నాయి.

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌‌లో సెమీస్‌ రేసు ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటిదాకా టోర్నీలో కొన్ని సంచలన విజయాలూ నమోదయ్యాయి. అఫ్గానిస్థాన్‌, నెదర్లాండ్స్‌ సంచలనాలు నమోదు చేశాయి. ఇంగ్లండ్‌, పాక్‌ పేలవ ప్రదర్శనలతో విమర్శలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు అభిమానులు, జట్ల దృష్టంతా నాకౌట్‌ చేరే జట్లేవి అన్న దానిపై ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ 31 మ్యాచ్‌లు జరగగా బంగ్లాదేశ్‌ ఒక్కటే అధికారికంగా నాకౌట్‌ నుంచి నిష్క్రమించింది. మిగిలిన 9 జట్లకు  సాంకేతికంగా అవకాశాలు ఉన్నాయి.

ఈ తొమ్మిది జట్లలో ఏ జట్టుకు నాకౌట్‌ చేరే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయంటే....

టీమిండియా: ఈ ప్రపంచకప్‌లో భారత్‌ జట్టు మొత్తం 6 మ్యాచ్‌లు సెమీఫైనల్‌ చేరడం దాదాపు ఖాయం చేసుకుంది. ఇంకొక్క మ్యాచ్‌ గెలిస్తే రోహిత్‌ సేన సెమీస్‌ చేరుకుంటుంది. అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయినా టీమిండియాకు అవకాశాలు ఉంటాయి. టీమిండియా సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు 99%.

దక్షిణాఫ్రికా: ఈ ప్రపంచకప్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు సెమీఫైనల్‌కు చేరే అవకాశం 98% ఉంది. ప్రొటీస్ జట్టు 6 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచింది. నెట్ రన్ రేట్ అద్భుతంగా ఉంది. మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్రొటీస్‌ సెమీస్ చేరుకుంది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడినా సెమీస్‌ ఆశలు ఉంటాయి. 

ఆస్ట్రేలియా: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కంగారూ జట్టు వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌కు చేరువైంది. ఆస్ట్రేలియా తదుపరి మూడు మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లు గెలిస్తే సెమీఫైనల్‌ చేరుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచినా మాత్రమే గెలిచినా కంగారులకు అవకాశాలు ఉంటాయి. కంగారూ జట్టు సెమీ ఫైనల్ అవకాశాలు 85%.

న్యూజిలాండ్: గత రెండు మ్యాచ్‌ల్లో కివీస్‌ జట్టు ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు కాస్త తగ్గినా న్యూజిండ్‌ సెమీస్ చేరే అవకాశాలు 84 శాతం ఉన్నాయి. కానీ కివీస్‌ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలవాలి. ఒకటి గెలిచినా నెట్ రన్ రేట్ పై నాకౌట్‌ ఆశలు ఆధారపడి ఉంటాయి.

ఆఫ్ఘానిస్థాన్: ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలను ఓడించి సెమీఫైనల్‌కు చేరేందుకు అఫ్గాన్‌ పోటీదారుగా మారింది. ఆఫ్ఘన్ జట్టు 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిస్తే, నెట్ రన్ రేట్ ఆధారంగా అఫ్గాన్‌ సెమీస్ చేరుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే కచ్చితంగా సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. ఆఫ్ఘన్ జట్టు సెమీస్‌ చేరే అవకాశాలు 15 శాతం.


పాకిస్థాన్: పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌కు కూడా సెమీస్‌ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలంటే పాక్‌ చివరి రెండు మ్యాచ్‌లను గెలిచి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. పాకిస్తాన్ సెమీస్‌ చేరే అవకాశం 10 శాతం మాత్రమే

శ్రీలంక: ఆరు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిన శ్రీలంక జట్టుకు సెమీఫైనల్ ఆడే అవకాశాలు కేవలం 5 శాతం మాత్రమే. శ్రీలంక నాకౌట్‌కు చేరాలంటే చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అంటే న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్‌లను ఓడించాలి. దీంతో పాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.

నెదర్లాండ్స్:  దక్షిణాఫ్రికా, శ్రీలంకలను ఓడించిన నెదర్లాండ్స్‌కు కూడా సెమీస్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. డచ్‌ జట్టు ఆశలు సాకారం కావాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, మిగిలిన జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాలి. నెదర్లాండ్స్ సెమీస్‌ ఆశలు కేవలం 3%.

ఇంగ్లండ్‌: ప్రపంచకప్‌ 2023లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ  భారీ విజయం సాధించాలి. దీంతో పాటు ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ సెమీస్‌ అవకాశాలు 1% మాత్రమే.

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
AFG vs IND T20 Series: ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget