India vs Australia T20 Series: భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్.. వేదిక, మ్యాచ్ టైమింగ్స్ పూర్తి వివరాలు
Ind vs Aus T20 series MatchTimings | ఆస్ట్రేలితో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత్ సన్నద్ధమవుతోంది. 5 టీ20 సిరీస్ అక్టోబర్ 29న ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగుతుంది.

India vs Australia T20 series Schedule | భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇటీవల జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. తొలి 2 వన్డేల్లో కంగారూలు నెగ్గగా, మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 29 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతాయి. అదే సమయంలో మధ్యాహ్నం 1:15 గంటలకు అన్ని మ్యాచ్‌ల టాస్ వేస్తారు. ఇటీవల జరిగిన వన్డే సిరీస్ మ్యాచ్‌లు ఉదయం 9:00 గంటలకు మొదలయ్యేవి. టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇక్కడ అందిస్తున్నాం. .
సూర్యకుమార్ కెప్టెన్సీలో టీ20 సిరీస్, బుమ్రా పునరాగమనం
టీ20 సిరీస్‌లో ఇండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో కీలకమైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ ఆటగాళ్లు టీ20 జట్టులో భాగం కానున్నారు. అయితే, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోని కారణంగా టీ20 సిరీస్‌కు అందుబాటులో లేదు.
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్
వన్డే సిరీస్‌లాగే టీ20 సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. అయితే తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు ఆసీస్ జట్టును ప్రత్యేకంగా ప్రకటించారు. ఆ తర్వాత మూడో టీ20కి వేరే జట్టును, నాల్గవ, ఐదవ టీ20లకు వేరే జట్టును ప్రకటించారు. ఇందులో జోష్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్ అందుబాటులోకి వచ్చారు. అలాగే ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్ కూడా టీ20 జట్టులో ఆడనున్నారు.
భారత్, ఆస్ట్రేలియా 5 టీ20ల సిరీస్ తేదీలు, వేదిక, టైం
అక్టోబర్ 29న కాన్‌బెర్రాలో జరగనున్న మ్యాచ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుండగా.. గబ్బా వేదికగా చివరి టీ20 షెడ్యూల్ చేశారు. వన్డే సిరీస్ కోల్పోయిన భారత్, టీ20 సిరీస్ లో ఎలాగైనా నెగ్గాలని భావిస్తోంది.
తొలి టీ20 - అక్టోబర్ 29 - కాన్‌బెర్రా - భారత టైం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు
రెండవ టీ20 - అక్టోబర్ 31 - మెల్‌బోర్న్ - భారత టైం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు
మూడవ టీ20 - నవంబర్ 2 - హోబర్ట్ - భారత టైం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు
నాల్గవ టీ20 - నవంబర్ 6 - గోల్డ్ కోస్ట్ - భారత టైం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు
ఐదవ టీ20 - నవంబర్ 8 - గబ్బా - భారత టైం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు





















